2016 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్, ఆల్‌రౌండర్ బిపుల్ శర్మ, టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల వయసులో భారత్ నుంచి తప్పుకుని, యూఎస్‌ఏ తరుపున క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు బిపుల్...
1983లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన బిపుల్ శర్మ, 2018లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు. అయితే నాలుగే సీజన్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచుల్లో మాత్రమే బిపుల్‌కి అవకాశం దక్కింది...
29
2015 సీజన్‌లో లక్ష్మీ శుక్ల గాయపడడంతో అతని స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా బిపుల్ శర్మను జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఐపీఎల్ 2016 సీజన్‌లో బిపుల్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
39
గ్రూప్ స్టేజ్‌లో పెద్దగా మ్యాచులు ఆడని బిపుల్‌ను ప్లేఆఫ్స్‌లో బరిలో దించింది సన్‌రైజర్స్. మూడు మ్యాచుల్లోనూ అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించి ఆరెంజ్ ఆర్మీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బిపుల్...
49
కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 11 బంతుల్లో 27 పరుగులు చేసిన బిపుల్, ఫైనల్ మ్యాచ్‌లో కీలక దశలో ఏబీ డివిల్లియర్స్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు...
59
మొత్తంగా ఐపీఎల్‌లో 33 మ్యాచులు ఆడిన బిపుల్ శర్మ, 17 వికెట్లు తీసి, 152.03 స్ట్రైయిక్ రేటుతో 187 పరుగులు చేశాడు. దేశవాళీ టోర్నీల్లో పంజాబ్‌తో పాటు ఛంఢీఘర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం జట్లకి ఆడాడు బిపుల్.
69
120 కోట్లకు పైగా ఉన్నా జనాభాలో టీమిండియాకి ఆడే క్రికెటర్ల సంఖ్య 11. ఇప్పటికే ఆ తుది 11 మందిలో ప్లేస్ కోసం 50 నుంచి 60 మంది దాకా పోటీపడుతున్నారు. దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తూ, నిరాశగా విదేశాల బాట పడుతున్నారు క్రికెటర్లు...
79
2012 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన ఉన్ముక్త్ చంద్‌తో పాటు అతని జట్టులోని స్మిత్ పటేల్, మనన్ శర్మ... ఇప్పటికే భారత్ విడిచి యూఎస్‌ఏకి తరలివెళ్లిన విషయం తెలిసిందే...
89
ఇప్పుడు వారి దారిలోనే బిపుల్ శర్మ కూడా నడవాలని చూస్తున్నాడు. 50 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 81 లిస్టు ఏ మ్యాచులు, 88 టీ20 మ్యాచులు ఆడిన బిపుల్ శర్మ... ఓవరాల్‌గా 4400లకు పైగా పరుగులు, 265 వికెట్లు పడగొట్టాడు...
99
బిపుల్ శర్మ రిటైర్మెంట్‌పై ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘వెల్ డన్ లెజెండ్. నీతో క్రికెట్ ఆడడం చాలా ఎంజాయ్ చేశా, డ్రెస్పింగ్ రూమ్‌లో నువ్వుంటే సందడే వేరుగా ఉంటుంది. నువ్వు నిజంగా లెజెండ్‌వి. గొప్ప టీమ్ పర్సన్‌వి...’ అంటూ కామెంట్ చేశాడు వార్నర్.