టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లి ఆటతీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండేండ్లకు పైగా సెంచరీ చేయలేక తంటాలు పడుతున్న కోహ్లి.. ఈ సారైనా ఆ లోటును పూడ్చుతాడని అభిమానులు భావిస్తున్నారు.
28
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్సులో అతడు ఆ లోటును పూడ్చుతాడానే అనిపించింది. కానీ క్రీజులో నిలదొక్కుకున్న విరాట్.. అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు.
38
ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా టచ్ చేసిన కోహ్లి.. లుంగి ఎంగిడి బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఇక ఇదే విషయమై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
48
బంగర్ మాట్లాడుతూ... ‘సీమింగ్ పిచ్ లపై బౌలర్లపై దాడికి దిగడం కంటే మీరు మరోలా గేమ్ ఆడాల్సి ఉంటుంది. అటువంటి పిచ్ లపై కేవలం ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడతామంటే కుదరదు.
58
ఒకవేళ బ్యాటర్లు ఆ నిర్దిష్టమైన షాట్లపైనే ఆధారపడితే మాత్రం అది బౌలర్లు ఇట్టే పట్టేస్తారు. వాళ్లు పదే పదే వికెట్లకు దూరంగా ఊరించే బంతులు వేస్తూ బ్యాటర్ ను బోల్తా కొట్టిస్తారు.
68
ఇక నిన్న విరాట్ కోహ్లి ఔటైన విధానం చూస్తుంటే.. అతడు బ్యాక్ ఫుట్ ఎలా ఆడాలో అభివృద్ధి చేసుకుంటే మంచిది. లేకుంటే అతడు కేవలం ఫ్రంట్ ఫుట్ షాట్లు మాత్రమే ఆడినట్టు అనిపిస్తుంది.. నిన్న విరాట్ ఔటైన షాట్ ను చూసిన అదే భావన కలుగుతుంది. బంతిని అంచనా వేయడంలో చిన్న మానసిక లోపంలా తోస్తుంది....’అని బంగర్ అన్నాడు.
78
తొలి ఇన్నింగ్సులో ఛతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ గా నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్.. 94 బంతులాడి 35 పరుగులు చేసి మంచి టచ్ లోనే కనిపించాడు. కానీ అనవసర షాట్ ఆడి బలయ్యాడు. ఇలా ఔటవ్వడంపై అభిమానులతో పాటు చివరికి కోహ్లి కూడా తీవ్ర నిరాశకు గురై ఉంటాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు.
88
కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్ లో సెంచరీ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో అతడు శతకం బాదాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా కోహ్లి బ్యాట్ నుంచి మళ్లీ మూడంకెల స్కోరును చూడలేదు.