WTC ఫైనల్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్‌కు ఎంత దక్కుతుంది?

Published : Jun 14, 2025, 04:15 PM IST

WTC Final 2025 Prize Money: మూడో WTC ఫైనల్ ఉత్కంఠగా మొదలైంది. అయితే, ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం దిశగా ముందుకు సాగుతోంది. డబ్ల్యూటీసీ విజేత, రన్నరప్, మూడు, నాలుగు స్థానాలకు ICC ఇచ్చే నగదు బహుమతి ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్: విజేత, రన్నర్-అప్, ఇతర జట్లకు ఐసీసీ ప్రైజ్ మనీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడవ సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. ప్రస్తుతం లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరాటం కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ సౌతాఫ్రికా విజయం దిశగా ముందకు సాగుతోంది. డబ్ల్యూటీసీలో విజేత, రన్నరప్ తో పాటు మూడవ, నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ అందిస్తుంది. ఆ వివరాలు గమనిస్తే..

25
డబ్ల్యూటీసీ ఛాంపియన్ జట్టుకు రూ.30.79 కోట్ల ప్రైజ్ మనీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 విజేతగా నిలిచే జట్టుకు ఐసీసీ రూ.30.79 కోట్లు (3.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) బహుమతిగా ప్రకటించింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో బహుమతుల పరంగా రికార్డు స్థాయిలో ఉంది.

35
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రన్నరప్ కు రూ.17.96 కోట్లు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిన జట్టుకు రూ.17.96 కోట్లు (2 మిలియన్ డాలర్లు) నజరానా అందనుంది. ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితులను బట్టి దక్షిణాఫ్రికా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

45
మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు రూ.12.31 కోట్ల ప్రైజ్ మనీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరాజయం మూలంగా భారత్ ఫైనల్‌కు అర్హత పొందలేక, మూడవ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ, టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో మూడవ స్థానంలో నలిచిన భారత జట్టుకు రూ.12.31 కోట్లు బహుమతిగా లభించనుంది.

55
WTC 2025: ఇతర జట్లకు లభించే మనీ ఎంత?

• న్యూజిలాండ్ (నాలుగవ స్థానం): రూ.10.26 కోట్లు

• ఇంగ్లాండ్ (ఐదవ స్థానం): రూ.8.20 కోట్లు

• శ్రీలంక (ఆరవ స్థానం): రూ.7.18 కోట్లు

• బాంగ్లాదేశ్ (ఏడవ స్థానం): రూ.6.15 కోట్లు

• వెస్టిండీస్ (ఎనిమిదవ స్థానం): రూ.5.13 కోట్లు

• పాకిస్తాన్ (తొమ్మిదవ స్థానం): రూ.4.10 కోట్లు

WTC 2025: మొత్తం ప్రైజ్ మనీ ఎంత?

ఐసీసీ మొత్తం బహుమతుల నిధిగా $10 మిలియన్ (రూ.85 కోట్లకు పైగా) ఖర్చు చేస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు ప్రోత్సాహంగా ప్రైజ్ మనీని భారీగా పెంచింది.

Read more Photos on
click me!

Recommended Stories