WTC Final: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్.. బిగ్ ఫైట్ ప్లేయింగ్ 11 వీరే

Published : Jun 10, 2025, 08:57 PM IST

WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా జట్లు తరలపడుతున్నాయి. జూన్ 11న లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ : ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా

WTC Final 2025: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో మళ్లీ అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, తొలిసారిగా ఈ ఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ట్రోఫీని నిలబెట్టుకోవాలని ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్లు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్ గెలుచుకోవాలని టెంబ బావుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా బరిలోకి దిగుతోంది. 

25
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ ఎక్కడ జరుగుతుంది?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ మ్యాచ్ బుధవారం (జూన్ 11) నుంచి లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ప్రారంభమవుతుంది.

35
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ లైవ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?

భారతదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. అలాగే జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

45
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా జట్లు ఇవే

దక్షిణాఫ్రికా తుది జట్టు:

ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగామ్, కైల్ (వికెట్ కీపర్), మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడీ.

ఆస్ట్రేలియా తుది జట్టు:

ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, క్యామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బో వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

55
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా జట్ల ప్రస్తుత ఫామ్ ఎలా ఉంది?

ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టును టెంబా బవూమా నడిపిస్తాడు. ప్రస్తుతం ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు బలమైన, సమతుల్యమైన టీమ్‌గా ముందుకు వచ్చింది. కెప్టెన్ బవూమా ప్రకటించిన తుది 11 సభ్యుల జాబితాలో బ్యాటింగ్, బౌలింగ్‌ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ర్యాన్ రికెల్టన్ టాప్ ఆర్డర్‌ను ఓపెన్ చేస్తాడు. అతను 2023–25 డబ్ల్యూటీసీ చక్రంలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లాబుషేన్ ఓపెనింగ్ చేస్తారు. జోష్ హేజిల్‌వుడ్‌ను స్కాట్ బోలండ్‌పై ప్రాధాన్యతనిస్తూ పేస్ లైనప్ లో చేర్చారు. క్యామెరూన్ గ్రీన్ బ్యాక్ సర్జరీ అనంతరం జట్టులోకి తిరిగి వచ్చారు. బో వెబ్‌స్టర్ కూడా తుది జట్టులో నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories