సాహాకి మెసేజ్ పంపింది నేనే, కానీ ఆ మెసేజ్‌లు నావి కాదు.. జర్నలిస్ట్ రివర్స్ అటాక్...

Published : Mar 07, 2022, 09:33 AM IST

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరింపులకు పాల్పడుతూ వాట్సాప్ మెసేజ్‌లు చేయడం సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉదంతం ఊహించని టర్న్ తీసుకుంది...

PREV
19
సాహాకి మెసేజ్ పంపింది నేనే, కానీ ఆ మెసేజ్‌లు నావి కాదు.. జర్నలిస్ట్ రివర్స్ అటాక్...

తనకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సదరు జర్నలిస్టు మెసేజ్ చేయడం, ఆ ఛాట్ స్క్రీన్ షాట్లను సాహా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది...

29

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌తో పాటు బీసీసీఐ అధికారులు కూడా వృద్ధిమాన్ సాహాకు సపోర్ట్‌గా నిలిచారు... ఆ జర్నలిస్టు పేరు చెబితే చాలు, అతని పని చూసుకుంటామని హామీ ఇచ్చారు...

39

అయితే అతని పేరు బయటపెట్టడం తనకి ఇష్టం లేదని, అలా చేస్తే అతనికి, తనకీ తేడా ఏముంటుందని ట్వీట్ చేశాడు వృద్ధిమాన్ సాహా...

49

అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ, ఆ జర్నలిస్టు పేరు చెప్పాల్సిందేనంటూ వృద్ధిమాన్ సాహాను కోరారు. దీంతో ఆ జర్నలిస్టు పేరును అధికారులకు తెలియచేశాడు సాహా...

59

సాహా స్క్రీన్ షాట్స్ షేర్ చేసినప్పటి నుంచి అదే కచ్ఛితంగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందర్ పనేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది...

69

సోషల్ మీడియాలో వృద్ధిమాన్ సాహా ఉదంతంపై జర్నలిస్ట్ బొరియా మజుందర్‌ను ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ కూడా అయ్యాయి. 

79

ఇప్పుడు స్వయంగా బొరియా మజుందర్, వృద్ధిమాన్ సాహాతో ఛాటింగ్ చేసింది తానేనని, అయితే అతను చెబుతున్నట్టుగా తాను బెదిరింపులకు పాల్పడలేదంటూ వ్యాఖ్యానించాడు...

89

‘ప్రతీ కథకు రెండు వైపులు ఉంటాయి. వృద్ధిమాన్ సాహా నా వాట్సాప్ చాట్స్‌ను మార్ఫింగ్ చేసి, మార్పులు చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని బీసీసీఐని కోరారు...

99

నా ఇమేజ్‌ను దెబ్బతీసినందుకు వృద్ధిమాన్ సాహాకు నోటీసులు పంపబోతున్నాను. నిజం నిలకడగా బయటికి వస్తుంది...’ అంటూ ట్వీట్ చేశాడు మజుందర్...

click me!

Recommended Stories