ఇంగ్లాండ్‌తో చెన్నై టెస్టు మ్యాచ్‌ ఫిక్స్ అయ్యిందా... క్యూరేటర్‌పై అనుమానాలు, విచారణ జరపాలంటూ...

Published : Mar 06, 2022, 07:42 PM IST

స్వదేశంలో అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకి గత ఏడాది ఫిబ్రవరిలో ఊహించని షాక్‌ ఇచ్చింది ఇంగ్లాండ్ జట్టు. చెన్నైలోని చెపాక్ (ఎంఏ చిదంబరం) స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 227 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా...

PREV
110
ఇంగ్లాండ్‌తో చెన్నై టెస్టు మ్యాచ్‌ ఫిక్స్ అయ్యిందా... క్యూరేటర్‌పై అనుమానాలు, విచారణ జరపాలంటూ...

టెస్టు కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్.  డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు...

210

తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 178 పరుగులకి ఆలౌట్ చేసింది. అయినా 433 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక, వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

310

ఈ మ్యాచ్‌ క్యూరేటర్‌పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్, పిచ్ క్యూరేటర్‌ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు...

410

మ్యాచ్‌కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు...

510

క్యూరేటర్‌కి, గ్రౌండ్‌మెన్‌కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు. పిచ్‌ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు...

610

అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు పిచ్‌కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్‌ బ్యాటింగ్‌కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు...

710

బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్యూరేటర్... పిచ్‌పై నీళ్లు కొట్టి, రోలర్ ఎందుకు వాడాడు? కావాలని టీమిండియాకి విరుద్ధంగా రిజల్ట్ రావాలని ఈ విధంగా చేశాడా?

810

లేక మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా? అనేది తేల్చేందుకు బీసీసీఐ విచారణ జరపాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారని సమాచారం...

910

ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్‌ని ఆ పదవి నుంచి తొలగించి, వెంటనే బీసీసీఐ ఓ కొత్త క్యూరేటర్‌ని నియమించింది...

1010

ఆ తర్వాతి మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయగా, టెస్టు ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

click me!

Recommended Stories