దులీప్ ట్రోఫీకి దూరంగా వృద్ధిమాన్ సాహా... ఎంత బాగా ఆడినా ఇక టీమిండియాలో ఆడనివ్వరనే...

Published : Jun 19, 2023, 09:31 AM IST

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, దులీప్ ట్రోఫీ 2023 సీజన్ నుంచి దూరమయ్యాడు. వెస్టిండీస్‌‌తో టెస్టు సిరీస్‌కి అందుబాటులో ఉండాలని ఇషాన్ కిషన్, దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే, సాహా తప్పుకోవడానికి బలమైన కారణమే ఉంది...

PREV
17
దులీప్ ట్రోఫీకి దూరంగా వృద్ధిమాన్ సాహా... ఎంత బాగా ఆడినా ఇక టీమిండియాలో ఆడనివ్వరనే...

కెఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపికయ్యాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. అయితే శ్రీకర్ భరత్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

27
Ishan Kishan

అయితే వెస్టిండీస్ టూర్‌లో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో తనకు చోటు దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న ఇషాన్ కిషన్, దులీప్ ట్రోఫీ 2023లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఎలాంటి సూచన చేయకుండానే ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి..

37


మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా దులీప్ ట్రోఫీలో ఆడడం లేదు. తన ప్లేస్‌లో ఓ యంగ్ ప్లేయర్‌కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు వృద్ధిమాన్ సాహా..
 

47

‘ఇండియా తరుపున ఆడాలనుకునేవారికి దులీప్ ట్రోఫీ ఓ ఆశాకిరణం లాంటిది. తాను ఎంత బాగా ఆడినా, ఇకపై టీమ్‌కి సెలక్ట్ కానని తెలిసిపోయింది. అందుకే తన ప్లేస్‌లో ఓ కుర్రాడికి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా సాహా కోరాడు. అందుకే అభిషేక్ పోరెల్‌ని త్రిపుర టీమ్‌కి సెలక్ట్ చేశాం...’ అంటూ చెప్పుకొచ్చాడు త్రిపుర సెలక్టర్ జయంత దేవ్...

57
Image credit: Getty

బెంగాల్‌ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్, ఈస్ట్ జోన్ తరుపున దులీప్ ట్రోఫీలో ఆడబోతున్నాడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇషాన్ కిషన్‌కి, ఈస్ట్ జోన్‌ కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్టర్లు భావించినా.. అతని టోర్నీ నుంచి తప్పుకున్నాడు..

67

‘శ్రీకర్ భరత్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాకి వికెట్ కీపింగ్ చేశాడు. దులీప్ ట్రోఫీలో భరత్, సౌత్ జోన్ తరుపున ఆడుతున్నాడు. అందుకే ఇషాన్ కిషన్‌ని ఈస్ట్ జోన్‌కి కెప్టెన్‌గా నియమించాలని అనుకున్నాం...
 

77
Ishan Kishan

అలాగే వైట్ బాల్ క్రికెట్‌లో అతను రెగ్యూలర్‌గా టీమ్‌కి ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్‌తో ఈ విషయం గురించి ఫోన్‌లో మాట్లాడాడు జోనల్ సెలక్షన్ కమిటీ కన్వినర్ డెబాసిస్ చక్రవర్తి.. అయితే  దులీప్ ట్రీఫీ ఆడేందుకు అతను ఆసక్తిగా లేడని తెలిపాడు...’ అంటూ కామెంట్ చేశాడు జయంత దేవ్.. 

click me!

Recommended Stories