ఇదెక్కడి పిచ్.. అసలు దీనిమీద వికెట్లు ఎలా తీయాలి..? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఇంగ్లాండ్ స్టార్ పేసర్ కామెంట్స్

Published : Jun 18, 2023, 03:10 PM IST

Ashes 2023: యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తయారుచేసిన పిచ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. 

PREV
16
ఇదెక్కడి పిచ్.. అసలు దీనిమీద వికెట్లు ఎలా తీయాలి..? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఇంగ్లాండ్ స్టార్ పేసర్ కామెంట్స్

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ బ్యాటర్లు.. ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్నారు.  రెండో రోజు కంగారూ బ్యాటర్లు.. ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని 300 ప్లస్ స్కోరు చేశారు.  ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  శతకం కూడా సాధించాడు. 

26

అయితే ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్  మాత్రం ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పై  విమర్శలు గుప్పించాడు.  ఈ పిచ్ మరీ స్లోగా ఉందని..  దీనిపై వికెట్లు తీయడం అంతా ఆషామాషీ కాదని వాపోయాడు.  అసలు పిచ్ నుంచి  తమకు ఎలాంటి సహకారం అందలేదని కామెంట్స్ చేశాడు. 

36

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత  బ్రాడ్ మాట్లాడుతూ.. ‘ఈ పిచ్ గురించి ఏం కామెంట్ చేస్తాం..?  చాలా స్లో గా ఉంది.  బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో దాని శక్తిని కోల్పోతుంది.  అసలు ఈ పిచ్ క్యారెక్టర్‌లెస్ గా ఉంది.  చాలా నిర్దయగా మారింది. కొంచెం కూడా బౌలర్లకు సహకారం అందించడం లేదు.  

46

అయితే   దీని గురించి ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం   కరెక్ట్ కాదు.  మ్యాచ్ జరుగుతున్న కొద్దీ  పిచ్ ఏమైనా మారొచ్చు.  ఈ  రెండ్రోజులైతే ఎండ కాచింది. మూడో రోజు కాస్త మబ్బులు వచ్చే సూచనలున్నాయి. అప్పుడు మాకు కొంచెం స్వింగ్ లభించొచ్చు. ఇంగ్లాండ్ లో ఉన్న పిచ్‌లన్నింటిలోకెల్లా ఇదే స్లోయెస్ట్ పిచ్.  

56

సీమర్లకు ఇక్కడ  వికెట్లు తీయడం కష్టంతో కూడుకున్న పనే.  అయితే ఇది టెస్టు మ్యాచ్. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. చూద్దాం.  మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ లో మార్పులు  జరిగే అవకాశం ఉంటుంద.   మేం అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం..’ అని తెలిపాడు.  

66

కాగా  తొలి టెస్టులో  ఇంగ్లాండ్ టాస్ గెలిచి  ఫస్ట్  బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 78 ఓవర్లు ఆడి  393 పరుగులు చేసింది. జో రూట్ (118) సెంచరీ చేయగా జాక్ క్రాలే (61), జానీ బెయిర్ స్టో (78) రాణించారు. ఆస్ట్రేలియా  కూడా  94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.   ఉస్మాన్ ఖవాజా సెంచరీ (126 నాటౌట్) తో కదంతొక్కగా  ట్రావిస్  హెడ్ (50), అలెక్స్ కేరీ (52 నాటౌట్) లు  రాణించారు. 

click me!

Recommended Stories