WPL: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. డ‌బ్ల్యూపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్

Published : Feb 25, 2025, 08:47 AM IST

WPL's First-Ever Super Over: మ‌హిళా  ప్రీమియ‌ర్ లీగ్ (WPL) 2025లో ఆర్సీబీ-యూపీ వారియ‌ర్స్ మ్యాచ్ ఉత్కంఠను రేపుతూ సాగింది. చివరకు WPL లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్ ను యూపీ వారియర్స్ గెలుచుకుంది.

PREV
13
WPL: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. డ‌బ్ల్యూపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్
UP Warriorz, wpl , wpl 2025,

WPL's First-Ever Super Over: మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) చ‌రిత్ర‌లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ ఆడిన జ‌ట్లుగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, యూపీ వారియ‌ర్స్ ఘ‌న‌త సాధించాయి. మహిళల ప్రీమియర్ లీగ్(2025) సోమవారం (ఫిబ్రవరి 24) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఆరంభం నుంచి ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లింది. 

23
UP Warriorz, wpl , wpl 2025,

వరుస విజయాలతో ఆర్సీబీ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో గొప్ప ఆరంభం చేసింది. కానీ ఇప్పుడు ఆర్సీబీ జ‌ట్టు జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ముంబై తర్వాత, యూపీ వారియర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉందంటే, WPL చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఓవర్ కూడా ఈ మ్యాచ్ లోనే కనిపించింది. గెలుస్తామ‌నుకున్నమ్యాచ్ లో ను ఆర్సీబీ నుంచి యూపీ వారియ‌ర్స్ లాక్కుంది. సోఫీ ఎక్లెస్టోన్ ఆర్సీబీకి బిగ్ షాక్ ఇచ్చింది. 

క‌ష్ట స‌మ‌యంలో యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. దీని తరువాత, సూపర్ ఓవర్లో తన బౌలింగ్ తో ఆర్సీబీని దెబ్బ‌కొట్టింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ చినెల్లె హెన్రీ (04) వికెట్‌ను కోల్పోయి,  8/1కి పడిపోయింది. దీనికి ప్రతిస్పందనగా, ఆర్‌సిబి కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్ ఎక్లెస్టోన్ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆర్సీబీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. 

33
UP Warriorz, wpl , wpl 2025,

యూపీ వారియ‌ర్స్ ముందు 181 పరుగుల లక్ష్యం 

ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ వారియర్స్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ 19 బంతుల్లో 4 సిక్సర్లు, 1 ఫోర్‌తో 33 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. శ్వేతా సెహ్రావత్ కూడా 31 పరుగులు చేసి మ్యాచ్‌ను టైగా మార్చింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ఎక్లెస్టోన్ రనౌట్ అయ్యాడు. కెప్టెన్లు దీప్తి శర్మ (25), కిరణ్ నవ్‌గిరే (24) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ తరఫున స్నేహ రాణా 3 వికెట్లు, రేణుకా సింగ్ 2 వికెట్లు, కిమ్ గార్త్  2 వికెట్లు పడగొట్టారు.

ఎల్లీస్ పెర్రీ ఇన్నింగ్స్ వృధా

ఆర్సీబీ త‌ర‌ఫున ఎల్లీస్ పెర్రీ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ను ఆడారు. ఆమె 56 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అలాగే, డానీ వ్యాట్ హాడ్జ్ అర్ధ సెంచరీ చేశారు. దీంతో ఆర్సీబీ జట్టు స్కోరు 180కి చేరుకుంది. వీరు త‌ప్ప మ‌రేబ్యాట‌ర్ రాణించ‌లేక‌పోయారు.

Read more Photos on
click me!

Recommended Stories