WPL 2025: డ‌బ్ల్యూపీఎల్ లో తొలి ప్లేయర్ గా ఎల్లీస్ పెర్రీ స‌రికొత్త చ‌రిత్ర‌

Published : Feb 25, 2025, 08:17 AM IST

Ellyse Perry Creates History: మ‌హిళా  ప్రీమియ‌ర్ లీగ్ (WPL) 2025లో యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఎల్లీస్ పెర్రీ చ‌రిత్ర సృష్టించారు. WPLలో 800 పరుగుల మార్కును దాటిన మొదటి క్రికెటర్ గా ఘ‌న‌త సాధించారు.   

PREV
14
WPL 2025: డ‌బ్ల్యూపీఎల్ లో తొలి ప్లేయర్ గా ఎల్లీస్ పెర్రీ స‌రికొత్త చ‌రిత్ర‌

Ellyse Perry Creates History: మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ కొత్త మైలురాయిని అందుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్(2025) సోమవారం (ఫిబ్రవరి 24) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-యూపీ వారియర్స్ తలపడ్డాయి. 

ముంబై ఇండియన్స్ (MI) పై ఈ సీజన్‌లో తొలి ఓటమి తర్వాత విజయాల బాట పట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ జట్టుకు తొలి దెబ్బ తగిలింది. మ్యాచ్ నాలుగో ఓవర్‌లో కెప్టెన్ స్మృతి మంధానను దీప్తి శర్మ తొమ్మిది బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అవుట్ చేసింది.  

24

చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ

అయితే, పెర్రీ అర్ధ సెంచరీ చేయడంతో డేనియల్ వ్యాట్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్ర‌మంలోనే పెర్రీ WPL కెరీర్‌లో 50 పరుగుల మార్కును దాటింది.

పెర్రీ త‌న సూప‌ర్ ఫామ్ ను కొన‌సాగిస్తూ మెగ్ లాన్నింగ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయ‌ర్ గా నిలిచారు. ఆమె 800 పరుగుల మార్కును కూడా దాటింది. WPL చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది.

34

WPL చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయ‌ర్లు 

ఎల్లీస్ పెర్రీ - 800
మెగ్ లాన్నింగ్ - 782
నాట్ స్కైవర్-బ్రంట్ - 683
షఫాలీ వర్మ    -  654
హర్మన్‌ప్రీత్ కౌర్ - 645

44
Ellyse Perry

Ellyse Perry

అలాగే, పెర్రీ హాఫ్ సెంచరీతో లీగ్ చరిత్రలో ఈ మైలురాయిని చేరుకోవడం 7వ సారి. అంటే ఆమె టోర్నమెంట్‌లో 50+ స్కోర్‌లు సాధించిన లానింగ్ రికార్డును సమం చేసింది. 2024లో RCB టైటిల్ విన్నింగ్ సీజన్‌లో పెర్రీ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 69.40 సగటుతో 347 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకుంది. 

2025 ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆమె పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 200 పరుగులు పూర్తి చేసింది. 2023లో ప్రారంభ సీజన్‌లో ఆమె ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 253 పరుగులు చేసింది. బౌలింగ్ లో కూడా అద‌ర‌గొట్టే పెర్రీ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 6/15 స్పెల్‌తో ఆమె లీగ్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డును కూడా సృష్టించింది. ఈ మ్యాచ్ లో పెర్రీ 57 బంతుల్లో 90 పరుగులతో అజేయంగా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories