WPL 2024 auction: రూ. 40 లక్ష‌ల క‌నీస ధ‌ర‌తో రిజిష్ట‌ర్, కానీ వేలంలో అద‌ర‌గొట్టిన ఆస్ట్రేలియన్ అన్నాబెల్

First Published | Dec 9, 2023, 4:36 PM IST

WPL 2024 auction: రూ. 40 లక్ష‌ల క‌నీస ధ‌ర‌తో రిజిష్ట‌ర్ అయిన ఆస్ట్రేలియన్ అల్ రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్ డ‌బ్లూపీఎల్ వేలంలో మాత్రం అద‌ర‌గొట్టింది. రికార్డు ధ‌ర‌తో ఈ ప్లేయ‌ర్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. 
 

WPL 2024 auction, WPL 2024, annabel sutherland, annabel

Australian Annabel Sutherland: మ‌హిళ‌ల క్రికెట్ ప్రీమియ‌ర్ లీగ్ రెండో మినీ వేలం ప్రారంభ‌మైంది. ముంబ‌యిలో జ‌రుగుతున్న వేలం పాట‌ తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్ రికార్డు ధ‌ర‌లో చ‌రిత్ర సృష్టించారు. కేవ‌లం రూ. 40 లక్ష‌ల క‌నీస ధ‌ర‌తో రిజిష్ట‌ర్ అయిన ఈ ఆస్ట్రేలియన్ ప్లేయ‌ర్ వేలంలో ఏకంగా రూ.2 కోట్ల రూపాయ‌ల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆమెను ద‌క్కించుకుంది. 
 

WPL 2024 auction, WPL 2024, annabel sutherland, annabel

ఈ ఆస్ట్రేలియ‌న్ ఆల్ రౌండ‌ర్ ను ద‌క్కించుకోవ‌డానికి రెండు ప్రాంఛైజీలు పోటీప‌డ్డాయి. ఈ ప్లేయ‌ర్ కోసం వేలంలో ముంబ‌యి ఇండియ‌న్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటి ప‌డి అన్నాబెల్ ను ద‌క్కించుకుంది. ఆల్ రౌండ‌ర్ అయిన ఈ ప్లేయ‌ర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మంచి గ‌ణాంకాల‌ను రికార్డు చేసింది. ఐపీఎల్ 2023 వేలంలో గుజరాత్ జెయింట్స్ రూ.70 లక్షలకు కొనుగోలు చేసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ లో ఈ 22 ఏళ్ల ఆల్రౌండర్ పాల్గొన్నారు. అయితే ఆమె కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి 48 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టింది. ఆఫ్-సీజన్లో ఆమెను విడుదల చేశారు.
 


WPL 2024 auction, WPL 2024, annabel sutherland, annabel

ఆ తర్వాత మహిళల బిగ్ బాష్ మెల్బోర్న్ స్టార్స్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి 288 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా నిలిచింది. ఈ సీజన్ లో 4/22 అత్యుత్త‌మ రికార్డు స‌హా మొత్తం 23 వికెట్లు పడగొట్టింది. అలాగే, జూలైలో ఐర్లాండ్ తో జరిగిన వన్డేలో, ఆమె మూడవ వన్డేలో అజేయంగా 109 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 10 వికెట్ల విజ‌యాన్ని అందించింది.

Latest Videos

click me!