WPL Final
WPL 2025 - Delhi Capitals vs Mumbai Indians: మహిళా ప్రీమియర్ లీగ్ 2025 (డబ్ల్యూపీఎల్ 2025) ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. శనివారం రాత్రి 7:30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. నాట్ స్కీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.
అలాగే, మెగ్ లాన్నింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రోఫీని అందుకోవడానికి అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉంది. WPL 2025 బ్యాటింగ్, బౌలింగ్ పాయింట్ల పట్టికలో సివర్ బ్రంట్ (493 పరుగులు, 9 వికెట్లు), హేలీ మాథ్యూస్ (17 వికెట్లు, 304 పరుగులు) టాప్ లో ఉన్నారు. వీరి నుంచి ఫైనల్ లో మరో సూపర్ ఇన్నింగ్స్ వచ్చే అవకాశముంది.
wpl, Mumbai, wpl 2025,
ఛాంపియన్ కావడం ఢిల్లీ క్యాపిటల్స్ కు అంత సులభం కాదు
నాట్ స్కైవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ ఇద్దరూ తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తే, మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు తప్పవు. తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలనే కల చెదిరిపోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మెగ్ లానింగ్, మహిళా క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. WPL టైటిల్ గెలుచుకోవడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు.
WPL 2025
రెండో టైటిల్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్
మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించగా, ముంబై జట్టు ఎలిమినేటర్‌లో గుజరాత్ జాయింట్స్‌ను ఓడించి టైటిల్ మ్యాచ్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు బ్రబోర్న్ స్టేడియం పరిస్థితుల గురించి బాగా తెలుసు. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఢిల్లీ బౌలర్లు వారిని అధిగమించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించాల్సి ఉంటుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తిరిగి ఫామ్‌లోకి రావడం ముంబైకి శుభసూచకం. ముంబై ఇండియన్స్ జట్టు తన రెండవ WPL టైటిల్‌ను గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
MI vs DC: WPL 2025
ఢిల్లీ బౌలింగ్ పవర్ ఫైనల్లో పనిచేస్తుందా?
ఇప్పటివరకు, స్పిన్నర్ జెస్ జోనాసన్, భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే ఢిల్లీ తరపున బాగా రాణించారు. ఇద్దరూ చెరో 11 వికెట్లు పడగొట్టారు. రౌండ్ రాబిన్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ ముంబైని 9 వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేయడంతో జెస్ జోనాసన్, శిఖా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముంబై బ్యాట్స్‌మెన్లను మరోసారి వీరిద్దరూ ఇబ్బంది పెట్టడం పక్కా. బౌలింగ్‌లో సివర్ బ్రంట్, మాథ్యూస్ కూడా ఇప్పటివరకు బాగానే రాణించారు. ముంబై బౌలింగ్ దాడిలో బలమైన ఆల్ రౌండర్ అమేలియా కెర్ ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టింది.
Team Mumbai Indians' (Photo: X@wplt20)
షెఫాలీ వర్మ ఏం చేస్తుందో మరి
అనుకూలమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించనుంది. ముంబై తరఫున, ఆఫ్ స్పిన్నర్ గుప్తా కూడా ఇప్పటివరకు బాగా రాణించింది. ఆమె ఇప్పటివరకు నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ, ఎకానమీ రేటు ఏడు కంటే తక్కువగా ఉంది. ఢిల్లీకి పవర్ ప్లేలో షెఫాలీ వర్మ (300 పరుగులు) బ్యాటింగ్ కీలకం అవుతుంది. లానింగ్ కూడా ఢిల్లీ తరపున బాగా బ్యాటింగ్ చేశారు. ఇప్పటివరకు 263 పరుగులు చేశారు. యంగ్ ప్లేయర్ నిక్కీ ప్రసాద్ కూడా అవకాశం ఇచ్చినప్పుడల్లా బాగా ఆడారు.