WPL 2023 ఫైనల్ ఫైట్ నేడే: మొదటి టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్... ముంబై ఇండియన్స్ ఆశలన్నీ...

First Published Mar 26, 2023, 10:34 AM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 క్లైమాక్స్‌కి చేరుకుంది. భారీ అంచనాలు, అంతకుమించిన ఆశలతో మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ సాధించింది. డబ్ల్యూపీఎల్ ద్వారా ఎందరో యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలబడనుంది..

Delhi Capitals Women

ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ కెప్టెన్సీలో వరుస విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌కి అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మెగ్ లానింగ్, 8 మ్యాచుల్లో 310 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచింది..

Shafali Verma

యంగ్ ప్లేయర్ షెఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, మెరిజానే క్యాప్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఫైనల్ చేరడానికి 13 ఏళ్లు పట్టింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 2020లో తొలిసారి ఫైనల్ చేరింది ఢిల్లీ. అత్యంత లేటుగా ఫైనల్ చేరిన జట్టు కూడా అదే...

అలాంటి చరిత్ర ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మొట్టమొదటిసారే ఫైనల్ చేరిందంటే దానికి కారణం మెగ్ లానింగ్ కెప్టెన్సీయే. ముంబైతో పోలిస్తే ఢిల్లీ టీమ్‌లో స్టార్ ప్లేయర్లు చాలా తక్కువ. అయినా ఢిల్లీపైన భారీ ఆశలు ఉన్నాయి..

Image credit: PTI

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచింది ముంబై ఇండియన్స్. అయితే ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. చివరికి ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి ఎలిమినేటర్‌కి అర్హత సాధించింది. ఆ తర్వాత యూపీ వారియర్స్‌ని చిత్తు చేసి... ఫైనల్ చేరింది... 

Image credit: PTI

ముంబై ఇండియన్స్ గెలిచిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో హాఫ్ సెంచరీలు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’  అవార్డులు గెలిచింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఫైనల్‌లో కూడా ఆమె ఆటపైనే టీమ్ పర్ఫామెన్స్ ఆధారపడి ఉంది..

ముంబైలో నాట్ సివర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమీలియా కేర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. యంగ్ బౌలర్ సైకా ఇషక్, డబ్ల్యూపీఎల్‌లో స్టార్ పర్ఫామర్‌గా మారింది. 9 మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన సైకా ఇషక్, పర్పుల్ క్యాప్ రేసులో ఉంది...

WPL Final

యూపీ వారియర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇషీ వాంగ్ హ్యాట్రిక్ తీసింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ముంబైని 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

MIW vs DCW

వరల్డ్ క్రికెట్‌లో ఇద్దరు సీనియర్ కెప్టెన్ల మధ్య సమరంగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అంతర్జాతీయ క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌పై మెగ్ లానింగ్‌దే విజయం. మరి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే నేటి సాయంత్రం ఫైనల్ మ్యాచ్ దాకా ఆగాల్సిందే.. 

click me!