రానైతే వచ్చాను గానీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.. ఆడతానో లేదో..! : ఆర్సీబీకి షాకిచ్చిన ఆసీస్ ఆల్ రౌండర్

First Published Mar 25, 2023, 5:34 PM IST

IPL 2023: ఆర్సీబీకి ఇదివరకే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ గాయంతో దూరమైన నేపథ్యంలో తాజాగా మరో  ఆటగాడు కూడా ఈ సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉంది.  ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని టీమ్ లలో మొదటి స్థానంలో ఉండే జట్టు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ).  టీమ్ నిండా   అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు, సమయానికి ఆదుకునే ఆల్  రౌండర్లు,  కావాల్సినప్పుడు వికెట్లు తీసే ఫాస్ట్ బౌలర్లు, ప్రపంచ నెంబర్ వన్  స్పిన్నర్ ఉన్నా ఇంతవరకూ ఆ జట్టు  ట్రోఫీ గెలవలేదు.  
 

ఈ సీజన్ లో అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలని  ఆర్సీబీ భావిస్తున్నది.అయితే పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగానే జరుగుతున్నాయి.  ఇదివరకే   ఆ జట్టు స్టార్ ఆల్  రౌండర్, గతేడాది ఐపీఎల్ మినీ వేలంలో    రూ. 3.2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విల్ జాక్స్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా  ఆ జట్టుకు మరో షాక్ కూడా తాకేలా ఉంది.  ఆర్సీబీ కీలక ఆల్ రౌండర్, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ  టోర్నీలో ఆడేది అనుమానంగానే ఉంది. ఐపీఎల్ ఆడేందుకు మ్యాక్సీ.. బెంగళూరుకు వచ్చినా అతడు మ్యాచ్ లు ఆడటానికి వంద శాతం ఫిట్ గా లేడని స్వయంగా అతడే వెల్లడించాడు. 

ఇటీవలే  ఆర్సీబీ క్యాంప్ తో కలిసిన మ్యాక్సీ ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే  కాళ్లు బాగానే ఉన్నాయి.  కానీ వంద శాతం  ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత సమయం పడుతుంది.   ఏదేమైనా అంతా సజావుగా సాగి టోర్నీ  మొత్తం బాగా ఆడాలని కోరుకుంటున్నా..’అని   చెప్పాడు. ఇప్పుడు ఇవే కామెంట్స్  ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

2019 తర్వాత  సొంతమైదానం  (బెంగళూరు) లో  ఆడుతుండటం సంతోషంగా ఉందన్న  మ్యాక్స్‌వెల్.. ఈ సీజన్ లో ఆడతాడా..? లేదా..? అన్నది అనుమానమే.  ఆస్ట్రేలియాలో  గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి కాలు విరగ్గొట్టుకున్న  మ్యాక్సీ.. ఆ తర్వాత సుమారు నాలుగైదు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 
 

ఇటీవలే ఆస్ట్రేలియా వన్డే సిరిస్  ఆడేందుకు భారత్ కు వచ్చిన జట్టులో మ్యాక్సీ కూడా సభ్యుడు. తొలి వన్డేలో   బ్యాటింగ్ చేసిన మ్యాక్సీ..  8 పరుగులు చేశాడు.  మరి పూర్తి ఫిట్నెస్ లేకుంటే  ఈ సిరీస్ ఎలా ఆడాడన్నది అనుమానం.  మరి మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఆడతాడా..?  ఆడినా గాయంతో మునపటి ఆటతో ఆకట్టుకుంటాడా..? అన్నది  ఆసక్తికరంగా మారింది. 

click me!