ధోనీ అంత కోపంగా ఊగిపోవడం ఎప్పుడూ చూడలేదు... ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా కామెంట్స్...

First Published Mar 25, 2023, 5:21 PM IST

క్రికెట్‌లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. బద్ధ శత్రువులుగా ఉన్న కృనాల్ పాండ్యా, దీపక్ హుడా ఇద్దరూ కూడా ఒకే టీమ్‌కి ఆడుతూ మిత్రులుగా మారిపోయా 12 ఏళ్ల పాటు కలిసి ఆడిన ధోనీ- సురేష్ రైనా... వేరుపడ్డారు...
 

ఐపీఎల్ 2021 సీజన్ నాకౌట్ మ్యాచుల్లో సురేష్ రైనాని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, 2022 మెగా వేలంలో అతన్ని బేస్ ప్రైజ్‌కి కూడా కొనుగోలు చేయలేదు. పర్సులో రూ.2 కోట్ల మిగులు ఉన్నా, రైనా బేస్ ప్రైజ్ అంతే అయినా అతన్ని తిరిగి తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు చెన్నై సూపర్ కింగ్స్..
 

ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 2010 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా...

‘ధోనీ లాగ్ ఆన్‌ మీదుగా ఓ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతి, అతని హెల్మెట్‌కి తగిలింది. నేను ఎప్పుడూ ఏ మ్యాచ్‌లోనూ ధోనీని అంత కోపంగా చూడలేదు. అందరికీ తెలుసు మాహీని కూల్ కెప్టెన్, కెప్టెన్ కూల్ అంటారు. కానీ ఆ రోజు మాత్రం హైటెన్షన్ వైర్‌లా కనిపించాడు... అతనితో ఏమైనా మాట్లాడాలంటేనే భయమేసింది.. 

2004లో ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మాహీని మొదటిసారి కలిశా. జార్ఖండ్ నుంచి ఓ జుంపాల వికెట్ కీపర్ బాగా ఆడుతున్నాడని అప్పటికే వింటున్నాం. మేం అతని గురించి మాట్లాడుకుంటుంటే ధోనీ భాయ్.. ఓ మూలన కూర్చొని రోటీ, బటన్ చికెన్ తింటున్నాడు...

మా టీమ్ కెప్టెన్ గయు బాయ్, మాహీని చూసి... చూస్తుంటే అతను చాలా కూల్ పర్సన్‌లా ఉన్నాడు. వాడి వల్ల మన టీమ్‌ ఓడిపోతుందని అనుకోవడం లేదు. అతను ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు చేయనివ్వండి.... అన్నాడు. ఆ తర్వాత గయు బాయ్ బౌలింగ్‌లో మాహీ సిక్సర్ల మీద సిక్సర్లు బాదాడు...

అతనికి ఎన్ని బైక్స్ ఉన్నాయో లెక్కేలేదు. మూడ్‌ని బట్టి నచ్చిన బైక్ వేసుకెళ్లిపోతాడు. అలాగే వింటేజ్ కార్లంటే కూడా ధోనీకి చాలా ఇష్టం. అతని దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఉంది.. మేం ఎప్పుడైనా తినడానికి వెళ్లాలంటే కనీసం 10-15 ధోనీ కోసం వెయిట్ చేయాల్సిందే...

ధోనీకి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. టైం దొరికితే చాలు, గేమ్స్‌లో మునిగిపోతాడు. దాన్ని మధ్యలో ఆపడం అతనికి ఇష్టం ఉండదు. అందుకే అయ్యేదాకా మేం కూడా చూస్తూ ఉండేవాళ్లం..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. 

click me!