బ్రేక్ తీసుకుని, బేసిక్స్ నుంచి మొదలెట్టబోతున్న విరాట్ కోహ్లీ... మళ్లీ చిన్ననాటి కోచ్ చెంతకు...

Published : Jul 19, 2022, 01:26 PM IST

కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ... వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి ప్లేయర్లు కూడా దూరంగా ఉండగా కోహ్లీ, టీ20 సిరీస్ నుంచి కూడా రెస్ట్ తీసుకున్నాడు...

PREV
16
బ్రేక్ తీసుకుని, బేసిక్స్ నుంచి మొదలెట్టబోతున్న విరాట్ కోహ్లీ... మళ్లీ చిన్ననాటి కోచ్ చెంతకు...

రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ, పరుగులు చేయడానికి కష్టపడుతున్న సమయంలో బ్రేక్ కావాలని కోరడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది...

26
Virat Kohli

ఏ ప్లేయర్ అయినా సెంచరీలు చేస్తున్న సమయంలో బాగా అలిసిపోయే రెస్ట్ కావాలని కోరుకుంటాడని, విరాట్ కోహ్లీ మాత్రం పట్టుమని 10 పరుగులు కూడా చేయడానికి కూడా కష్టపడుతున్న సమయంలో బ్రేక్ కావాలని కోరుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని మరికొందరు కామెంట్లు చేశారు...

36

ఈ బ్రేక్ టైమ్‌ని ఫ్యామిలీతో ఏకాంతంగా గడపడానికి లేదా తన కూతురితో కలిసి ఒంటరిగా ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదించడానికి విరాట్ కోహ్లీ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్రేక్ టైమ్‌ని విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఉపయోగించుకోబోతున్నాడట...

46

వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడిపే విరాట్ కోహ్లీ, ఆ తర్వాత తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అకాడమీకి వెళ్లి శిక్షణ మొదలెట్టబోతున్నాడని సమాచారం. అవసరమైతే మళ్లీ బేసిక్స్ నుంచి మొదలెట్టాలని కోహ్లీ గట్టిగా ఫిక్స్ అయ్యాడట...

56
Image credit: Getty

‘అవును, విరాట్ కోహ్లీ నా అకాడమీకి వస్తాడని చెప్పాడు. అతను ఇక్కడ కొంత కాలం గడపబోతున్నాడు. అతని టెక్నిక్‌లో నిజంగా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

66
Virat kohli With Childhood coach Rajkumar Sharma

వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత ఆగస్టులో ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతోంది భారత జట్టు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి ప్రకటించే జట్టులో విరాట్ కోహ్లీ ఉంటుందా? ఉండదా? అనేది ఆసక్తికరంగా మారింది...

Read more Photos on
click me!

Recommended Stories