టీమిండియా జెర్సీ వద్దని ఎమ్మెస్ ధోనీకి చెప్పా... పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ కామెంట్...

First Published Jul 19, 2022, 1:58 PM IST

టాలెండ్ ఉందని అనుకుంటే శత్రుదేశం వాడిని అభినందించడం, అభిమానించడంలో తప్పు లేదు. అయితే పొరుగు దేశం వాడిని అభిమానించి, అతను ధరించే జెర్సీని మాత్రం శత్రువుగా భావిస్తే... ఏమనాలి? వాళ్లను పాకిస్తాన్ క్రికెటర్లు అని పిలవాలి... తాజాగా పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్ చేసిన కామెంట్స్, దీన్ని నిజం చేస్తున్నాయి...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌కి భారత జట్టుపై దక్కిన తొలి విజయం ఇది...

ఈ టోర్నీకి భారత జట్టు మెంటర్‌గా వ్యవహరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లతో కలిసి మాట్లాడాడు. మాహీ క్రీజులోకి వచ్చిన సమయంలో చాలామంది పాక్ క్రికెటర్లు అతని చుట్టూ చేరి... శిష్యుల్లా చేతులు కట్టుకుని ధోనీ మాటలను విన్నారు...

Latest Videos


Haris Rauf Dhoni

‘గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత్‌తో మ్యాచ్ తర్వాత నేను ఎమ్మెస్ ధోనీని కలిశా. మాహీ అంటే నాకు ఎంతో అభిమానం. అందుకే అతని టీషర్ట్స్ పంపాల్సిందిగా కోరాను. అయితే టీమిండియా జెర్సీలు వద్దని, సీఎస్‌కే జెర్సీలు పంపాలని మరీ మరీ చెప్పాను...

మాహీ తప్పకుండా పంపుతానని మాటిచ్చాడు. ఎట్టకేలకు నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ధోనీ జెర్సీలు నాకు చేరాయి... మాహీతో పాటు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కి థ్యాంక్యూ చెప్పాను...’ అంటూ చెప్పుకొచ్చాడు హారీస్ రౌఫ్...

haris rauf

అలాగే పాక్ బౌలర్‌ అయినప్పటికీ భారత జట్టుకి నెట్ బౌలర్‌గా బౌలింగ్ చేశాడు హారీస్ రౌఫ్. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు పాక్ ఫాస్ట్ బౌలర్...

Cheteshwar Pujara

‘టీమిండియా, ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు నెట్ బౌలర్లు కావాలని టీమ్ ఇండియా మేనేజర్ నుంచి కబురు వచ్చింది. అంతర్జాతీయ క్రికెటర్లకు బౌలింగ్ చేసే గొప్ప అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు... అందుకే వెళ్లి భారత బృందానికి నెట్ బౌలర్‌గా చేరాను...

ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీలకు నెట్స్‌లో బౌలింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశా. అప్పుడు నాతో పాటు హార్ధిక్ పాండ్యా కూడా నెట్స్‌లో బౌలింగ్ చేశాడు... 

haris rauf

ఆ సమయంలో నా బౌలింగ్‌ను మెచ్చుకున్న హార్ధిక్ పాండ్యా, త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ తరుపున ఆడతావని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు నాలో నింపిన భరోసా ఎప్పటికీ మరిచిపోలేను..’ అంటూ చెప్పుకొచ్చాడు 28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్.. 

click me!