విరాట్ కోహ్లీ చెత్త బ్యాటింగ్.. కెరీర్ లోనే పెద్ద మచ్చ ఇది

First Published | Aug 7, 2024, 11:15 PM IST

Virat Kohli : రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని భార‌త వ‌న్డే జ‌ట్టు శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ను 0-2 తో కోల్పోయింది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొన‌సాగుతున్న విరాట్ కోహ్లీ ఈ వన్డే సిరీస్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.
 

Virat Kohli

Virat Kohli : శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు వన్డే సిరీస్‌ ఓటమితో తిరిగొచ్చింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భార‌త జ‌ట్టు మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోయింది. చివ‌రి, మూడో వ‌న్డేలో ఏకంగా 110 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘోరంగా ఓడిపోయింది. మొత్తంగా భార‌త్ వ‌న్డే సిరీస్ ను కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాటింగ్. 

Virat Kohli

ఈ భార‌త్-శ్రీలంక వ‌న్డే సిరీస్ లో భార‌త బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న అస్స‌లు బాగలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మరే భార‌త‌ బ్యాట్స్‌మెన్ పెద్ద‌గా పరుగులు చేయలేదు. వన్డే ఫార్మాట్‌లో గొప్ప బ్యాట్స్‌మెన్, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. అంతే కాదు ఈ సిరీస్‌లో కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చాడు.


India vs Sri Lankam, Virat,

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్‌లు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 19.33 మాత్రమే. అతని బ్యాట్ నుంచి కేవలం 8 ఫోర్లు మాత్రమే వ‌చ్చాయి. శ్రీలంకతో ఇప్పటివరకు ఆడిన వన్డే సిరీస్‌లో విరాట్ చెత్త ప్రదర్శన ఇదే. దీని కంటే ఎక్కువ సగటుతో 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతని సగటు 31.80గా ఉండ‌టం విశేషం. 

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ కొన‌సాగుతున్నాడు. విరాట్ ఇప్పటివరకు 295 వన్డేల్లో 13906 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (18234) తర్వాత భారత్ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా విరాట్ కోహ్లీనే. 

వన్డేల్లో విరాట్ అత్యుత్తమ స్కోరు 183 పరుగులు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా అతనే. గ‌త సంవ‌త్స‌రం స‌చిన్ టెండూల్క‌ర్ 49 వ‌న్డే సెంచ‌రీల రికార్డును బ్రేక్ చేసి తన 50వ సెంచరీని సాధించాడు. అలాగే, 72 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, ఇటీవ‌ల విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పెద్ద‌గా ప‌రుగులు రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్, క్రికెట్ ల‌వ‌ర్స్ నిరాశ‌ను వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

click me!