అరంగేట్రంలోనే 25 ఏండ్ల రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రియాన్ ప‌రాగ్

First Published | Aug 7, 2024, 10:45 PM IST

IND vs SL ODI:  భార‌త్ తో జ‌రిగిన మూడో మ్యాచ్ లో శ్రీలంక కీల‌క ప్లేయ‌ర్లైన అవిష్క ఫెర్నాండో, కెప్టెన్ చరిత్ అసలంక, దునిత వెల్ల‌లాగేలను త‌న అరంగేట్రం మ్యాచ్ లోనే రియాన్ ప‌రాగ్ ఔట్ చేశాడు. భారత సీనియ‌ర్ బౌల‌ర్లు త‌డ‌బుతున్న స‌మ‌యంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 
 

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో, ఈ సిరీస్ లో చివ‌రి మ్యాచ్ లో టీమిండియా త‌ర‌ఫున యంగ్ ప్లేయ‌ర్ రియాన్ ప‌రాగ్ అరంగేట్రం చేశాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప‌రాగ్ అద్భుత బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. 
 

Riyan Parag

త‌న తొలి వ‌న్డే మ్యాచ్ లోనే రియాన్ ప‌రాగ్ సూపర్ బౌలింగ్ తో శ్రీలంక ఆట‌గాళ్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకున్నాడు. అర్ష్‌దీప్‌ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన రియాన్ ప‌రాగ్ ఈ మ్యాచ్ లో 9 ఓవర్ల బౌలింగ్ లో 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.


Riyan Parag

శ్రీలంక ప్రధాన బ్యాట్స్‌మెన్లు అవిష్క ఫెర్నాండో, కెప్టెన్ చరిత్ అసలంక, దునిత వెల్ల‌లాగేలను రియాన్ ప‌రాగ్ పెవిలియ‌న్ కు పంపాడు. భారత సీనియ‌ర్ బౌల‌ర్లు తడబడుతున్న సమయంలో రియాన్ వ‌చ్చి శ్రీలంక భారీ స్కోర్ చేయ‌కుండా చెక్ పెట్టాడు. భవిష్యత్తులో భారత క్రికెట్‌ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదగగలనని అరంగేట్రంలోనే నిరూపించుకున్నాడు. మ్యాచ్‌కి ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరంగేట్రం క్యాప్‌ను రియాన్‌ పరాగ్ కు అందించాడు. 

Riyan Parag

ఈ మ్యాచ్ లో అవిష్క ఫెర్నాండోను అవుట్ చేసి భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును రియాన్ ప‌రాగ్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఫెర్నాండోను 96 పరుగుల వ‌ద్ద త‌న తొలి వ‌న్డే వికెట్ గా రియాన్ ప‌రాగ్ ఔట్ చేశాడు. ద్రవిడ్‌ తన వన్డే కెరీర్‌లో (1999లో) పాకిస్థాన్‌ ఆటగాడు సయీద్‌ అన్వర్‌ తొలి వికెట్ గా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అన్వర్ 95 పరుగులు చేశాడు.

భార‌త  వ‌న్డే అరంగేట్రం ప్లేయ‌ర్ గా అత్య‌ధిక ప‌రుగుల తొలి వికెట్ తీసిన ప్లేయ‌ర్ గా రియాన్ ప‌రాగ్ రికార్డు సృష్టించాడు. ఈ లిస్టు గ‌మ‌నిస్తే.. 

96 పరుగులు- అవిష్క ఫెర్నాండో- కొలంబో- 2024 (బౌలర్: రియాన్ పరాగ్)
95 పరుగులు- సయీద్ అన్వర్- జైపూర్ 1999 (బౌల‌ర్: రాహుల్ ద్రవిడ్)
92 పరుగులు- నిజాకత్ ఖాన్- దుబాయ్ 2018 (బౌలర్: ఖలీల్ అహ్మద్)
90 పరుగులు - జాన్ ఎడ్రిచ్ - లీడ్స్ 1974 (ఎస్ వెంకటరాఘవన్)

Latest Videos

click me!