వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదా? సునీల్ గవాస్కర్‌‌కి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ...

First Published Mar 24, 2023, 10:56 AM IST

ధోనీ కెప్టెన్సీలో మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవడానికి తెగ కష్టపడుతోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా, డెడికేషన్ కూడా ఓ కారణమే. వరల్డ్ కప్ కోసం అప్పుడే పుట్టిన తన కూతురిని చూసుకునేందుకు నెల రోజులు వెయిట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత అంత డెడికేషన్ పెట్టిన కెప్టెన్ టీమిండియాకి దొరకలేదు.. 

ఆడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత టీమ్‌ని వదిలేసి పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ. ఇక రోహిత్ శర్మ అయితే టీమిండియా మ్యాచుల కంటే బామ్మర్ది పెళ్లికి వెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...


ఓ వైపు టీమిండియా, ఆస్ట్రేలియాతో మొదటి వన్డే ఆడుతుంటే రోహిత్ శర్మ, తన బామ్మర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. టీమిండియా కెప్టెన్ అయ్యుండి, ఇలా చిన్న చిన్న విషయాల కోసం సెలవులు తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జనాలు...

Latest Videos


టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ శర్మపై ఫైర్ అయ్యాడు.. ‘కెప్టెన్ అయ్యిండి, అతను ఇలా మాటిమాటికి సెలవులు తీసుకోవడం ఏం బాగోలేదు. రోహిత్ శర్మ ఇకనైనా ప్రతీ మ్యాచ్ ఆడాలి. వరల్డ్ కప్‌కి ఎంతో సమయం లేదు... ఇకనైనా టీమ్ కాంబినేషన్‌పైన దృష్టి పెట్టాలి..

టీమ్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. హార్ధిక్ పాండ్యా, టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ ఇలా మాటిమాటికి రెస్ట్ తీసుకుంటూ పోతే హార్ధిక్ పాండ్యాకి వన్డే కెప్టెన్సీ ఇచ్చేస్తే మంచిది. టీమ్ కాంబినేషన్‌పై కెప్టెన్‌ని పూర్తి క్లారిటీ ఉండాలి. అలా రావాలంటే ప్రతీ మ్యాచ్ ఆడాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గవాస్కర్...

‘వరల్డ్ కప్ ఉంటే.. బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదా? ప్రతీ ఒక్కరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కుటుంబం కంటే ఏమీ ముఖ్యం కాదు కదా.. వరల్డ్ కప్‌కి ముందు అన్ని పనులు పూర్తి చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎనర్జీని కాపాడుకుంటూ ఏ పని చేసినా తప్పు లేదు...

కెప్టెన్‌గా వరుసగా మ్యాచులు ఆడుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్స్ వల్ల చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం. కొత్త ఎనర్జీ పుడుతుంది.. అది చాలా స్పెషల్..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

click me!