ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాక రిటైర్ అవ్వాలనుకున్న సచిన్ టెండూల్కర్... అయితే అతను చెప్పడంతో...

First Published Mar 24, 2023, 9:46 AM IST

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రస్తావన వస్తే, సచిన్ పేరు చెప్పకుండా, టెండూల్కర్ రికార్డుల గురించి ప్రస్తావించకుండా ముగించలేం.  రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, తన కెరీర్‌‌లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. 2007 వన్డే వరల్డ్ కప్ పరాభవం, భారత క్రికెట్‌లో మరిచిపోలేని ఘట్టం...

Sachin Tendulkar

2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన భారత జట్టు, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో తిరుగులేని విజయాలు అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది. అందుకే ఆ తర్వాతి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. అయితే అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది...

గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన టీమిండియా, సూపర్ 12 రౌండ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. బంగ్లాపై ఓడిన తర్వాత బర్ముడాపై భారీ విజయం అందుకున్న టీమిండియా, శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో ఓడిపోయింది...

Latest Videos


2003 వన్డే వరల్డ్ కప్‌లో 673 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఈ రికార్డును ఇప్పటికీ ఏ బ్యాటర్ కూడా అందుకోలేకపోయాడు... అయితే 2007 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ అంచనాలను అందుకోలేకపోయాడు... 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 7 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, బర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. లంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మాస్టర్, దిల్హరా ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

Shahid Afridi-Sachin Tendulkar

ఈ మ్యాచ్‌ తర్వాత భారత జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేయర్ల దిష్టిబొమ్మలు ఊరేగించి, చెప్పుల దండలతో కొట్టడం, దహనం చేయడం చేసి తీవ్రంగా అవమానించారు. మహేంద్ర సింగ్ ధోనీ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు... ఈ సంఘటనలతో తీవ్ర మనస్థాపం చెందిన సచిన్ టెండూల్కర్, రిటైర్ అవ్వాలని అనుకున్నాడు...

Image credit: Getty

అయితే వెస్టిండీస్ దిగ్గజం వీవ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడి.. ఇలాంటి ఓటమి వచ్చిందని తప్పుకుంటే, ఇన్నేళ్లు ఆడినదానికి విలువ ఉండదని నచ్చచెప్పాడు. ఆ మాటలతో తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన సచిన్ టెండూల్కర్, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు...
 

2007 వన్డే వరల్డ్ కప్ తర్వాత 78 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్, 48.36 సగటుతో 3579 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Sachin Tendulkar

వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా, 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచిన సచిన్ టెండూల్కర్, అనుకున్నట్టుగానే 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు.. 

click me!