భారత జట్టుకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ సాధించింది భారత జట్టు. ఈ రెండు విజయాల్లోనూ భాగస్వామిగా ఉన్నాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మాహేంద్ర సింగ్ ధోనీ హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించి, క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నాడు.
28
మాహీ సిక్సర్ కారణంగా అంతకుముందు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లు ఆడిన ఇన్నింగ్స్‌లను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్...
38
Image Credit: Getty Images
క్యాన్సర్‌తో పోరాడుతూ, క్రీజులో రక్తపు వాంతులు అవుతున్నా మొండిగా ఆటను కొనసాగించిన యువరాజ్ సింగ్‌కి కూడా వరల్డ్ కప్ విజయాల్లో దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదు..
48
గౌతమ్ గంభీర్ ఈ విషయంపై చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్, ఈ విషయంపై మరోసారి తన స్టైల్‌లో స్పందించాడు.
58
‘ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిస్తే, ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ గెలిచిందని అంటారు. అదే టీమిండియా గెలిస్తే, ఎమ్మెస్ ధోనీ వరల్డ్ కప్ గెలిచాడని అంటారు...
68
ఎమ్మెస్ ధోనీ వరల్డ్ కప్ గెలిస్తే, మరి మిగిలిన 10 మంది ఏం చేశారు. నేను, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఏం చేశాం... లస్సీ తాగడానికి వెళ్లామా...
78
ఇది టీమ్ గేమ్. అందరం కలిసి ఆడడం వల్లే వరల్డ్ కప్ గెలవగలిగాం. ఏ ఒక్కరి వల్లా వరల్డ్ కప్ రాదు...’ అంటూ తన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్...
88
హర్భజన్ సింగ్ కామెంట్లపై ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్, యువరాజ్ సింగ్, టీమిండియా ఫ్యాన్స్ మధ్య మరోసారి చిచ్చు రేగింది. భజ్జీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ కొందరు, మాహీకి క్రెడిట్ దక్కితే తట్టుకోలేకపోతున్నారా? అంటూ ధోనీ ఫ్యాన్స్ కొట్టుకుంటూ కామెంట్లు పెడుతున్నారు..