నాకేమైనా అయితే వాళ్లు నిన్ను ప్రాణాలతో వదలరు... షోయబ్ అక్తర్‌ని బెదిరించిన టెండూల్కర్...

Published : Apr 12, 2022, 04:52 PM IST

సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా యాప్‌లు లేని సమయంలో జనాలను టీవీలకు అత్తుకుపోయేలా చేసిన శక్తి సచిన్ టెండూల్కర్. టెండూల్కర్‌ని ఒక్కడిని అవుట్ చేస్తే చాలు, మ్యాచ్ గెలిచేయొచ్చని ప్రత్యర్థి టీమ్ ఫిక్స్ అయిపోయేది. సచిన్ అవుటైతే చాలు, టీవీలన్నీ ఆఫ్ అయిపోయేవి...

PREV
17
నాకేమైనా అయితే వాళ్లు నిన్ను ప్రాణాలతో వదలరు... షోయబ్ అక్తర్‌ని బెదిరించిన టెండూల్కర్...

క్రికెట్ ప్రపంచంలో అంతటి ఫాలోయింగ్, క్రేజ్ మరొకరు సొంతం చేసుకోవడం అసాధ్యమే. తనకి వచ్చిన అనంతమైన పాపులారిటీని చూసి సచిన్ టెండూల్కర్ ఎలా ఫీలయ్యేవాడు...

27

‘నా క్రికెట్ కెరీర్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు స్టోరీలుగా చెప్పొచ్చు. ఇది లక్నోలో జరిగిన మ్యాచ్ టైమ్‌లో జరిగింది. అక్కడ ఓ పార్టీ జరిగింది...
 

37

ఆ పార్టీకి భారత్, పాకిస్తాన్ ప్లేయర్లు వచ్చారు. అందరం మంచి పార్టీ మూడ్‌లో ఉన్నాం. నేను సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్లి, ‘నేను నిన్ను భుజాలపైకి ఎత్తుకుంటా...’ అని కోరా...

47

సచిన్ టెండూల్కర్ ఎత్తు తక్కువ కావడంతో ఈజీగా ఎత్తేయొచ్చని అనుకున్నా. అయితే నేను ఎత్తుకోగానే సచిన్ టెండూల్కర్ జారి, కిందపడిపోయాడు...

57

ఆ దెబ్బకి అతను గాయపడి ఉంటాడని అనుకున్నా. వెంటనే ‘సచిన్ ఏమీ తగల్లేదు కదా...’ అంటూ క్షమాపణలు కోరుతూ అడిగాను...

67

‘నాకు ఏమైనా అయితే, ఇండియన్ ఫ్యాన్స్ నిన్ను ప్రాణాలతో బతకనివ్వరు. బతికి ఉండగానే కాల్చేస్తారు...’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్... 

77

అప్పుడు ఆయనకి ఉన్న ఫాలోయింగ్‌ ప్రకారం చూస్తే, సచిన్ టెండూల్కర్ మాటలు నిజమే... టెండూల్కర్ నా వల్ల గాయపడి ఉంటే, క్షేమంగా పాక్‌కి వెళ్లేవాడిని కాదేమో...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...

click me!

Recommended Stories