మా కోహీనూర్ డైమండ్ తిరిగి ఇచ్చేయండి... ఇంగ్లాండ్ కామెంటేటర్‌తో సునీల్ గవాస్కర్ కామెంట్...

Published : Apr 12, 2022, 04:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. మొదటి వారం టీఆర్పీ రేటు కాస్త తగ్గినా, రెండో వారంలో వ్యూయర్‌షిప్ బాగానే పెరిగింది. కొన్నిసార్లు ఐపీఎల్‌లో క్రికెట్‌తో ఇతర విషయాల గురించి కామెంటేటర్ల మధ్య చర్చ జరుగుతుంది. తాజాగా సునీల్ గవాస్కర్, కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. 

PREV
19
మా కోహీనూర్ డైమండ్ తిరిగి ఇచ్చేయండి... ఇంగ్లాండ్ కామెంటేటర్‌తో సునీల్ గవాస్కర్ కామెంట్...

లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ కామెంటేటర్ అలెన్ విల్‌కిన్స్‌తో కలిసి కామెంటేటర్‌గా వ్యవహరించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
 

29
Sunil Gavaskar

ముంబైలోని మెరీన్ డ్రైవ్ గురించి కామెంటేటర్ల చర్చ జరిగింది. దీనికి ‘క్వీన్ నెక్లెస్’ అని పేరు ఉందని చెప్పిన సన్నీ గవాస్కర్, ‘మేము ఇంకా కోహీనూర్ డైమండ్ గురించి ఎదురుచూస్తూనే ఉన్నాం...’ అంటూ ఇంగ్లాండ్ కామెంటేటర్‌తో కామెంట్ చేసి నవ్వేశాడు...

39

గవాస్కర్ సడెన్‌గా కోహినూర్ డైమండ్‌ గురించి ప్రస్తావించడంతో ఏం చెప్పాలో తెలియని అలెన్, పక్కున నవ్వేశాడు. ‘నాకు తెలిసి అది వస్తుందనుకుంటా... ’ అంటూ సమాధానం ఇచ్చాడు...

49

‘నీకు మీ దేశంలో పలుకుబడి ఉంటే దాన్ని ఉపయోగించి బ్రిటీష్ గవర్నమెంట్ మా డైమెండ్ వెనక్కి ఇచ్చేటట్టు చూడు’ అంటూ కోరాడు సునీల్ గవాస్కర్. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
 

59

దాదాపు 50 లక్షల మంది హాట్ స్టార్ యాప్ ద్వారా, కొన్ని కోట్ల మధ్య టీవీల ద్వారా మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో కోహీనూర్ డైమండ్ గురించి, ఇంగ్లీష్ కామెంటేటర్‌‌ను ప్రశ్నించిన సునీల్ గవాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు...

69
Sunil Gavaskar

రాజకీయ నాయకులు చేయలేని పనిని సునీల్ గవాస్కర్ చేశారని, ఆయన రాజకీయాల్లోకి వస్తే మన సంపద మనకి తిరిగి తీసుకువస్తారని పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు... 

79

2 వందల ఏళ్లు బ్రిటీష్ వాడి బానిస సంకెళ్ల కింద నలిగిన భారతదేశం, ఎంతో విలువైన సంపదను కోల్పోయింది. అఖండ భారతదేశం నుంచి వందల వేల కోట్ల విలువైన ఆభరణాలు, మణులు, మాణిక్యాలను ఇంగ్లాండ్‌కి రైళ్ల ద్వారా తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. అలా ఇంగ్లీషోడి దేశానికి చేరిన భారత సంపదలో కోహినూర్ డైమండ్ కూడా ఒకటి...

89

అత్యంత అరుదైన కోహినూర్ డైమండ్‌ని ఇంగ్లాండ్ రాణి ధరించే కిరీటంలో అమర్చాడని, ఆమె నెక్లెస్‌లో పొందుపర్చారని అనేక కథనాలు వినిపించాయి... అయితే అది ఎక్కడుందనే విషయంపై సరైన సమాచారం లేదు...

99

170 ఏళ్ల కిందట బ్రిటీష్ ప్రభుత్వం, ఇంగ్లాండ్‌కి తరలించిన అమూల్యమైన కోహీనూర్ డైమండ్‌ని వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేసినా, ఇప్పటివరకూ ఏదీ సక్సెస్ కాలేదు...

click me!

Recommended Stories