విరాట్ కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్ కప్ గెలవలేరు? అతను ఉండాల్సిందే... టీమిండియా మాజీ కోచ్ కామెంట్..

First Published | Aug 17, 2023, 5:46 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు అందరూ టీ20 ఫార్మాట్‌‌కి దూరంగా ఉంటున్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే టీ20 మ్యాచులు ఆడుతోంది భారత జట్టు...

Image credit: Getty

స్వదేశంలో జరిగిన టీ20 సిరీసుల్లో ప్రతాపం చూపిస్తూ వచ్చిన హార్ధిక్ పాండ్యా టీమ్, వెస్టిండీస్ పర్యటనలో జరిగిన టీ20 సిరీస్‌లో 3-2 తేడాతో ఓడింది. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు ఉన్నా సిరీస్ పరాజయం నుంచి కాపాడలేకపోయారు..
 

Image credit: PTI

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడబోతుందని, రోహిత్ శర్మ మళ్లీ పొట్టి ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని వార్తలు వినిపించాయి. అయితే రోహిత్ మాత్రం వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నట్టు కామెంట్ చేశాడు..


Image credit: PTI

జూన్ 4 నుంచి జూన్ 30 వరకూ వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడి తీరాల్సిందేనని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్...
 

Image credit: PTI

‘నూటికి నూరు శాతం, విరాట్ కోహ్లీ టీ20 టీమ్‌లో ఉండి తీరాల్సిందే. గత వరల్డ్ కప్‌లో అతను ఏం చేయగలడో చూశారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్, వేరే బ్యాటర్ నుంచి ఊహించగలరా?
 

Image credit: Getty

టీ20ల్లో విరాట్ కోహ్లీని ఎందుకు ఆడించడం లేదో నాకైతే తెలీదు. అయితే అతను వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ మాత్రం ఆడాలి. కీలక మ్యాచుల్లో ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో విరాట్‌కి బాగా తెలుసు..
 

Image credit: PTI

చిన్న చిన్న తప్పిదాలు మ్యాచ్‌ రిజల్ట్‌ని మార్చేస్తారు. అలాంటి సందర్భాల్లోనూ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, టీమ్‌కి ఆపద్భాంధవుడిలా మారతాడు. అతని స్ట్రైయిక్ రేటుతో సంబంధం లేదు. ఐపీఎల్‌లోనూ అతను ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు..
 

Image credit: Getty

ఒక్కో బ్యాటర్‌కి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కొందరు మొదటి బంతి నుంచి వేగంగా ఆడతారు. మరికొందరు మ్యాచ్‌కి అవసరమైనట్టుగా స్ట్రైయిక్ రేటు పెంచుతూ పోతారు. విరాట్ కోహ్లీ రెండో కోవకు చెందినవాడు. ఓ స్టేజీ తర్వాత అతని స్ట్రైయిక్ రేటు, చాలామంది హిట్టర్ల కంటే ఎక్కువగా ఉంటుంది..
 

Image credit: Getty

సెంచరీ కొట్టకపోయినా, సిక్సర్లు బాదకపోయినా మ్యాచ్‌ని ఎలా మలుపు తిప్పాలో విరాట్‌కి బాగా తెలుసు. అతను కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్ల కోవకు చెందినవాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మేం చేసిన వన్నీ బాగా క్లిక్ అయ్యాయి.. అతని కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్.. 

Latest Videos

click me!