శిఖర్ ధావన్ ఫిట్‌గా ఉండి ఉంటే, 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచేవాళ్లం... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...

Published : Aug 17, 2023, 05:06 PM IST

ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడి పరుగులు చేశాడు శిఖర్ ధావన్. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత శిఖర్ ధావన్ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చింది. 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ ఆడని శిఖర్ ధావన్, వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో ఉంటాడా? అనేది అనుమానంగా మారింది..

PREV
18
శిఖర్ ధావన్ ఫిట్‌గా ఉండి ఉంటే, 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచేవాళ్లం... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...
Image credit: Getty

ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చే శిఖర్ ధావన్‌ని, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడించాలని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ప్రయత్నించాడు. అయితే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఫిక్స్ అయిన సెలక్టర్లు, శిఖర్ ధావన్‌ని పట్టించుకోలేదు..

28
Image credit: PTI

శుబ్‌మన్ గిల్ కారణంగా వన్డేల్లో కూడా చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేందుకు ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్.. ఇలా ఒకరికి ముగ్గురు పోటీపడుతున్నారు..

38
Image credit: Getty

‘ఇషాన్ కిషన్‌ని టాపార్డర్‌లో ఓపెనింగ్ ఆడిస్తే బెటర్. రోహిత్ ఓపెనర్‌గా వస్తాడు, విరాట్ వన్‌డౌన్‌లో, శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే టాపార్డర్‌లో ఓ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కచ్ఛితంగా ఉండాలి..
 

48

కారణం ఏంటో తెలీదు కానీ శిఖర్ ధావన్‌కి రావాల్సినంత క్రేజ్ రాలేదు, దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదు. అతను ఓ అద్భుతమైన ప్లేయర్. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా శిఖర్ ధావన్ చాలా బాగా ఆడాడు..
 

58
Image credit: PTI

ఆ టోర్నీ మధ్యలో శిఖర్ ధావన్ గాయపడడం మాపైన తీవ్రంగా ప్రభావం చూపించింది. అతను ఉండి ఉంటే, న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈజీగా గెలిచి ఉండేవాళ్లం. టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే, ప్రత్యర్థి జట్టుపై ప్రెషర్ పెరుగుతుంది..
 

68
Shikhar Dhawan

బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఎలా ఆడాలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు బాగా తెలుసు. నెంబర్ 4లో తిలక్ వర్మను ఆడిస్తే, టాప్ 4లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లను ఉపయోగించినట్టు అవుతుంది. అలాగే యశస్వి జైస్వాల్ రూపంలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా అందుబాటులో ఉన్నాడు..

78

ఎందుకంటే అనుభవం ఉన్న ప్లేయర్‌ని ఆడించాలని అనుకుంటే శిఖర్ ధావన్‌ని వన్డే వరల్డ్ కప్ ఆడించాలి. అనుభవంతో పనిలేదని భావిస్తే, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..

88

అయితే యశస్వి జైస్వాల్, వరల్డ్ కప్ సమయంలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ హుడా, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లు ఆసియా క్రీడల్లో ఆడబోతున్నారు. 

click me!

Recommended Stories