బెన్ స్టోక్స్ వచ్చాడు! ధోనీ, యువరాజ్ సింగ్‌లకు కూడా వరల్డ్ కప్‌ ఆడిస్తే... ఫ్యాన్స్ డిమాండ్...

Published : Aug 17, 2023, 03:38 PM IST

2019 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వన్డే రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని... 2023 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. బెన్ స్టోక్స్ రీఎంట్రీతో ఇంగ్లాండ్ హాట్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా మారిపోయింది..

PREV
18
బెన్ స్టోక్స్ వచ్చాడు! ధోనీ, యువరాజ్ సింగ్‌లకు కూడా వరల్డ్ కప్‌ ఆడిస్తే... ఫ్యాన్స్ డిమాండ్...
Ben Stokes

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు మెంటల్ స్పేస్ కోసం కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, జూలై 2022లో వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు తీవ్రమైన మెంటల్ ప్రెషర్‌కి లోనవుతున్నారని చాలాసార్లు కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్..

28
Moeen Ali

2021లో టెస్టు ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, యాషెస్ సిరీస్ 2023 టోర్నీకి ముందు రీఎంట్రీ ఇచ్చాడు. కరెక్టుగా యాషెస్ సిరీస్ ఆడి, ఆఖరి టెస్టు తర్వాత మళ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..

38

బెన్ స్టోక్స్ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వరకూ 50 ఓవర్ల ఫార్మాట్‌ ఆడబోతున్నాడనేది ఓపెన్ సీక్రెట్. దీంతో టీమిండియా కూడా మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, ధోనీ, గౌతమ్ గంభీర్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..

48

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఫినిషర్ రోల్ పోషించలేకపోతున్నారు. దీంతో ఈ ప్లేస్‌లో ధోనీని తిరిగి ఆడిస్తే బాగుంటుందని కొందరి ఫ్యాన్స్ డిమాండ్..  

58

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో మోకాలి నొప్పితో బాధపడుతూ చికిత్స చేయించుకున్న ధోనీకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలు అస్సలు లేవు..

68

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీ రోల్ పోషించిన యువరాజ్ సింగ్... 2017 తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు. రెండేళ్ల పాటు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూసి 2019లో రిటైర్మెంట్ తీసుకున్నాడు..

78

రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, ఐపీఎల్ ఆడాలని అనుకున్నాడు యువరాజ్ సింగ్. అయితే అప్పటికే గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడిన యువీ, రీఎంట్రీ ఇవ్వడానికి అర్హత కోల్పోయాడు యువీ...

88

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు గౌతమ్ గంభీర్. 2018లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన గంభీర్, ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడగల సామర్థ్యం ఉన్న ప్లేయర్లలో ఒకడు. 

Read more Photos on
click me!

Recommended Stories