బుమ్రా లేకుండా గెలవడం అంత ఈజీ కాదు! ద్రావిడ్, హార్ధిక్, రోహిత్‌లకు సపోర్ట్ చేయండి.. - మహ్మద్ కైఫ్

Published : Aug 08, 2023, 06:32 PM IST

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అంతకుముందు రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోయినా, ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దుమ్మురేపేది. ద్రావిడ్ కోచింగ్‌లో అది కూడా చేయలేకపోతోంది..

PREV
111
బుమ్రా లేకుండా గెలవడం అంత ఈజీ కాదు! ద్రావిడ్, హార్ధిక్, రోహిత్‌లకు సపోర్ట్ చేయండి.. - మహ్మద్ కైఫ్

జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్, జడేజా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు గాయాలతో జట్టుకి దూరమైన తర్వాత కూడా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాని ఓడించి, గబ్బా కోటను కూల్చింది భారత జట్టు. అయితే ఇప్పుడు వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి జట్లపై కూడా ఓడిపోతూ పరువు పోగొట్టుకుంటోంది..
 

211
Rahul Dravid-Rohit Sharma

రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఓడిన భారత జట్టు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై వన్డే సిరీస్ కోల్పోయింది. అయితే వెస్టిండీస్‌లోనూ 17 ఏళ్ల తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డు మూటకట్టుకుంది..

311

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2022 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన భారత జట్టు, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక స్వదేశంలోనూ తప్ప విదేశాల్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయింది...

411

‘వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే మనం ఇంత ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో టీమిండియాపై చాలా నెగిటివ్ రియాక్షన్ చూస్తున్నా... వాళ్లు మన టీమ్, మన సపోర్ట్ కావాలి. హార్ధిక్, రోహిత్, రాహుల్ ద్రావిడ్‌లకు మీ సపోర్ట్ కావాలి. 

511

కానీ నేను చెప్పేది ఒక్కటే, భారత జట్టు ఓడిన ఈ రెండు మ్యాచుల్లోనూ ఆఖరి వరకూ పోరాడింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రం టీమిండియాని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అదీకాక మన కీ ప్లేయర్లు ఆడడం లేదు..

611
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా లేకపోవడం టీమ్‌కి చాలా పెద్ద మైనస్. అతను పూర్తిగా కోలుకుంటే, మ్యాచ్‌కి కావాల్సిన ఫిట్‌నెస్ సాధిస్తే, టీమిండియాకి ఓ బ్రహ్మాస్త్రం దొరికినట్టే. బుమ్రా పూర్తి ఫిట్‌గా టీమ్‌లోకి వస్తే, స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..

711

చాలామంది రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా, ఆసియా కప్ ఓడిపోయిందని, టీ20 వరల్డ్ కప్ ఓడిపోయిందని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవలేకపోయిందని అంటున్నారు. నేను అర్థం చేసుకోగలను. కానీ బుమ్రా లేకుండా గెలవడం అంత ఈజీ కాదు..

811
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా మ్యాచ్ విన్నర్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బుమ్రా ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడలేదు. అదే టీమ్‌పై ప్రభావం చూపుతోంది. బుమ్రా తిరిగి టీమ్‌లోకి వస్తే 50 శాతం మ్యాచులను అతనే గెలిపిస్తాడు.

911

బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లతో వరల్డ్ కప్ కూడా గెలవగలం...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..

1011

అయితే కైఫ్ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా ఓటమి తర్వాత ఇదే మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించాడు. అతను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గానే చరిత్రలో మిగిలిపోతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు..

1111

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జస్ప్రిత్ బుమ్రా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 టోర్నీల్లో ఆడాడు. అయితే ఈ టోర్నీల్లో ఎందులోనూ బుమ్రా నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదనే విషయాన్ని మహ్మద్ కైఫ్ మరిచిపోయినట్టు ఉన్నాడని గుర్తు చేస్తున్నారు కోహ్లీ అభిమానులు. 

Read more Photos on
click me!

Recommended Stories