హార్ధిక్ పాండ్యాకి రాహుల్ ద్రావిడ్‌ నుంచి సరైన సపోర్ట్ దక్కడం లేదు! అందుకే... పార్థివ్ పటేల్ కామెంట్స్

Published : Aug 08, 2023, 05:43 PM IST

ఐపీఎల్ సక్సెస్‌తో టీమిండియాకి కెప్టెన్సీ చేసే బంపర్ ఆఫర్ కొట్టేశాడు హార్ధిక్ పాండ్యా. గత ఏడాది ఏడుగురు కెప్టెన్లను మార్చిన టీమిండియా, వైట్ బాల్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని ఫిక్స్ అయిపోయింది. అయితే పాండ్యా కెప్టెన్సీలోని టీమ్‌కి వెస్టిండీస్ టూర్‌లో షాక్ తగిలింది..  

PREV
19
హార్ధిక్ పాండ్యాకి రాహుల్ ద్రావిడ్‌ నుంచి సరైన సపోర్ట్ దక్కడం లేదు! అందుకే... పార్థివ్ పటేల్ కామెంట్స్

వెస్టిండీస్ టూర్‌లో రెండో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో ఊహించిన ఓటమి రుచి చూసిన భారత జట్టు, మొదటి రెండు టీ20ల్లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి టీ20లో 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..

29

డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన వెస్టిండీస్, వరుస పరాజయాలతో నాకౌట్ స్టేజీకి కూడా అర్హత సాధించలేకపోయింది.  టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అయితే క్వాలిఫైయర్స్ కూడా దాటలేకపోయిన వెస్టిండీస్, వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లోనూ ఓడింది..  

39
Hardik Pandya

అలాంటి వెస్టిండీస్ చేతుల్లో టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వరుస పరాజయాలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.. 

49
India vs West Indies

ఐపీఎల్ 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, టైటిల్ గెలిచి సంచలనం క్రియేట్ చేసింది. 2023 సీజన్‌లోనూ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది.. హార్ధిక్ కెప్టెన్సీలో టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2024 ఆడడం దాదాపు ఖాయమే..
 

59

‘మొదటి రెండు టీ20ల్లో టీమిండియా చిన్న చిన్న తప్పుల వల్ల ఓడింది. మొదటి మ్యాచ్‌లో నికోలస్ పూరన్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు అక్షర్ పటేల్‌కి బౌలింగ్ ఇచ్చి, హార్ధిక్ పాండ్యా తప్పు చేశాడు..

69

రెండో టీ20లో యజ్వేంద్ర చాహాల్ 16వ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాక, అతనితో 18వ ఓవర్ వేయించకపోవడం చాలా పెద్ద తప్పు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా అదరగొట్టాడు. అక్కడికి అతనికి పూర్తి స్వేచ్ఛ దొరికింది..

79
Nehra-Hardik Pandya

గుజరాత్ టైటాన్స్‌లో హార్ధిక్ పాండ్యాకి ఆశీష్ నెహ్రా సపోర్ట్ ఉంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా ప్రోయాక్టివ్ కోచ్. చాలా నెమ్మదస్తుడు. టీ20 ఫార్మాట్‌కి ద్రావిడ్ లాంటి టెస్టు ప్లేయర్ కోచ్‌గా ఉండడం కరెక్ట్ కాదు..

89

టీ20ల్లో టీమ్‌ని నడిపించే కెప్టెన్ ఎప్పుడూ హుషారుగా ఉండాలి, దూకుడుగా నిర్ణయాలు తీసుకోగలగాలి. హార్ధిక్ పాండ్యాలో అలాంటి స్పార్క్ ఉంది. అయితే రాహుల్ ద్రావిడ్‌లో అది లేదు. అందుకే హార్ధిక్ పాండ్యాకి కావాల్సిన సపోర్ట్, ద్రావిడ్ నుంచి దక్కడం లేదు.. 

99

టీ20ల్లో ఒకే ఒక్క ఓవర్, అంతెందుకు ఒకే ఒక్క బాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో బరిలో దిగాల్సి ఉంటుంది. హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్‌కి నాలుగో ఓవర్ ఇవ్వకుండా ఎవరో ఆపి ఉండాలి. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.. 

click me!

Recommended Stories