అది నాకో పీడకల! అందుకే 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచులు కూడా చూడలేదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

Published : Aug 08, 2023, 06:09 PM IST

2007 టీ20 వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2011 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది భారత జట్టు.. 

PREV
16
అది నాకో పీడకల! అందుకే 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచులు కూడా చూడలేదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
rohit sharma sad

2007లోనే టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో రోహిత్‌ శర్మని 2011 ప్రపంచ కప్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు.. అతని స్థానంలో పియూష్ చావ్లాకి టీమ్‌లో చోటు దక్కింది...

26

ప్రస్తుతం యూఎస్‌ఏ టూర్‌లో ఉన్న రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీతో పోటోలు దిగాడు. ‘వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని మొదటిసారిగా ఇంత దగ్గర్నుంచి చూశా. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాం కానీ నేను జట్టులో సభ్యుడిగా లేను.. అది చాలా అందంగా ఉంది..

36

వరల్డ్ కప్ వెనక ఎన్నో అనుభూతులు, మరెన్నో కథలు ఉన్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కనందుకు చాలా ఫీల్ అయ్యాను. కోపంతో వన్డే వరల్డ్ కప్ మ్యాచులు చూడొద్దని కూడా ఫిక్స్ అయ్యా. టీమ్ అంతా వరల్డ్ కప్ ఆడుతుంటే నేను ఇంట్లో ఉండడం చాలా కష్టంగా అనిపించింది. అదో పీడకలలా ఫీల్ అయ్యేవాడిని... 

46

అయితే భారత జట్టు బాగా ఆడుతూ క్వార్టర్ ఫైనల్స్‌కి వచ్చిందని తెలిశాక ఉండలేకపోయా. ప్రతీ మ్యాచ్, ప్రతీ బాల్ చూశా. అదో భిన్నమైన అనుభవం. నేను ఆడుతున్నట్టే ఫీల్ అయ్యా.. ఈ సారి మేం దాన్ని లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

56

2007 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన పియూష్ చావ్లా, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 3 మ్యాచులు ఆడి 4 వికెట్లు తీశాడు. అయితే భారీగా పరుగులు ఇవ్వడంతో పియూష్ చావ్లా ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి..

66

కెరీర్ ఆరంభంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి తెగ కష్టపడిన రోహిత్ శర్మ, 2013లో ఓపెనర్‌గా మారాక సూపర్ సక్సెస్ సాధించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ ఆడిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories