గెలిచి, ఈసారి అయినా ఫైనల్‌కి రాకపోతే బజ్‌బాల్‌ దండగే... ఇంగ్లాండ్ టీమ్‌పై మాజీ కెప్టెన్ ఫైర్..

Published : Jun 22, 2023, 05:01 PM ISTUpdated : Jun 22, 2023, 05:03 PM IST

వరుస పరాజయాలతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జో రూట్ స్థానంలో వచ్చిన బెన్ స్టోక్స్, టెస్టు ఆటకు కొత్త అర్థం చెప్పేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. దూకుడే మంత్రంగా నెత్తినబెట్టుకున్న బజ్‌బాల్ కాన్సెప్ట్, యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో బోల్తా కొట్టేసింది...  

PREV
16
గెలిచి, ఈసారి అయినా ఫైనల్‌కి రాకపోతే బజ్‌బాల్‌ దండగే... ఇంగ్లాండ్ టీమ్‌పై మాజీ కెప్టెన్ ఫైర్..
Ben Stokes

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్. క్రీజులో సెంచరీ హీరో జో రూట్ ఉన్నా, మరో ఇద్దరు బ్యాటర్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉన్నా... డిక్లేరేషన్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది..

26

ఆఖరికి ఈ నిర్ణయమై ఇంగ్లాండ్ ఓటమికి కారణమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో 281 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో డిక్లేర్ చేయకుండా ఉండి ఉంటే ఈజీగా మరో 50 పరుగులైనా ఇంగ్లాండ్ స్కోరులో చేరి ఉండేవి...
 

36
Ben Stokes

‘లార్డ్స్ టెస్టులో రెండు జట్లలోనూ చిన్న చిన్న మార్పులు ఉంటాయని అనుకుంటున్నా. తొలి టెస్టులో దక్కిన విజయం ఆస్ట్రేలియాకి కచ్చితంగా బూస్ట్ ఇస్తుంది. ఇంగ్లాండ్ ఆటతీరుపై వారికి పూర్తి క్లారిటీ వచ్చేసి ఉంటుంది..

46
Ben Stokes

బజ్‌బాల్, నాకు ఎంతో ఇస్టం.అయితే అన్నివేళలా అది సెట్ అవ్వదు. టెస్టుల్లో ఎనర్జీ నింపడానికి దూకుడు ఒక్కటే మార్గం కాదు, కొన్నిసార్లు క్లాస్ కూడా చూపించాలి. బజ్‌బాల్ అయినా మరేబాల్ అయినా గెలవడం ముఖ్యం..

56

అందుకు కాస్త స్మార్ట్‌నెస్ కూడా కావాలి. ఆస్ట్రేలియా వెనకడుగు వేసినప్పుడు, దాన్ని మరింత వెనక్కినెట్టే ఎత్తులు కావాలి. అయితే ఇంగ్లాండ్ అది చేయలేకపోయింది. రెండు సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడలేకపోయారు..
 

66
Ben Stokes

ఈసారి బజ్ బాల్ కాన్సెప్ట్‌‌ని నమ్ముకోవడంతో ఇంగ్లాండ్‌పై భారీ నమ్మకాలు ఉన్నాయి. ఈసారి కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించకపోతే, బజ్ బాల్ కూడా ఉట్టిదే అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాగన్.. 

click me!

Recommended Stories