నన్ను చూసి నేర్చుకున్నావా? మేం ఎలా ఆడతామో తెలుసా... ఓల్లీ రాబిన్‌సన్‌పై రికీ పాంటింగ్ సీరియస్..

Published : Jun 22, 2023, 03:43 PM IST

యాషెస్ సిరీస్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌కి ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, తొలి టెస్టు ఐదు రోజుల్లోనూ బ్యాటింగ్ చేసి అరుదైన రికార్డు సాధించాడు...

PREV
16
నన్ను చూసి నేర్చుకున్నావా? మేం ఎలా ఆడతామో తెలుసా...  ఓల్లీ రాబిన్‌సన్‌పై రికీ పాంటింగ్ సీరియస్..
Ollie Robinson

తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాని ఓల్లీ రాబిన్‌సన్ అవుట్ చేశాడు. అయితే వికెట్ పడిన తర్వాత ఉస్మాన్ ఖవాజాని బూతులు తిట్టిన ఓల్లీ రాబిన్‌సన్, తన ప్రవర్తన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు..

26
Ollie Robinson-Hayden

ఈ సంఘటనపై స్పందించిన ఓల్లీ రాబిన్‌సన్, ‘ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అండ్ ఆయన టీమ్ నుంచే నేను ఇది నేర్చుకున్నా. ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి ఇలాంటి మసాలా అవసరం. ఇదంతా లేకపోతే టెస్టు మ్యాచ్ బోర్ కొట్టేస్తది’ అంటూ కామెంట్ చేశాడు..

36

ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ‘ఓల్లీ రాబిన్‌సన్ ఏం చెప్పాడో నేను విన్నాను. మా రోజుల్లో ఈ ఇంగ్లాండ్ టీమ్ మాతో ఆడలేదు. అలా ఆడి ఉంటే యాషెస్ సిరీస్ అంటే ఎలా ఉంటుందో వాళ్లకి చూపించేవాళ్లం..
 

46
Ollie Robinson

ఆస్ట్రేలియా టీమ్‌తో ఆడాలంటే నరాలు వణికిపోయేవి. నాకు తెలిసి ఓల్లీ రాబిన్‌సన్‌కి ఇలాంటివి కొత్తేమీ కాదు, చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడానికి అతనికి చాలా సమయం పడుతోంది. అతను చాలా నెమ్మదస్థుడు...

56
Ricky Ponting

అతను నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు కొంచెం వింతగా అనిపించింది. మేం ఎలా ఆడేవాళ్లమో తెలుసా? మాతో పోటీ అంటే ఎలా ఉండేదో తెలుసా... అతను నన్ను తలుచుకుని బౌలింగ్ చేసి ఉంటే... 15 ఏళ్ల క్రితం మా ఆటను చూసి చాలా నేర్చుకునేవాడు..

66
Ricky Ponting

మేం కేవలం నోటీతో ఆడేవాళ్లం కాదు, టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా విజయం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్లం. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ల గురించి మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ రికీ పాంటింగ్.. 

click me!

Recommended Stories