వర్షం కారణంగా IND vs NZ ఫైనల్ రద్దైతే ఏమవుతుంది?
మార్చి 9న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం తక్కువ. దుబాయ్‌లో వాతావరణం సాధారణంగా ఉంటుందని సమాచారం. పగటిపూట 48 శాతం మేఘావృతం ఉంటుందని, వర్షం పడే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుందని అంచనా. మార్చి 9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సమయంలో వర్షం పడితే, టోర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వ్ డే (మార్చి 10, సోమవారం) ఉంటుంది.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే?
మార్చి 9న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, దానిని రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. వర్షం కారణంగా రిజర్వు డే రోజకూడా మ్యాచ్ కొనసాగకపోతే రద్దు చేస్తారు. ఇలాంటి పరిస్థితి వస్తే ట్రోఫీని భారత్ - న్యూజిలాండ్ లు పంచుకుంటాయి. గతంలో కూడా ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2002లో రద్దు అయింది. ఈ ఫైనల్ లో ఇండియా, శ్రీలంకలు తలపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ పూర్తికాలేదు. దీంతో రెండు జట్లను ఛాంపియన్ గా ప్రకటించారు. ఇరు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి.