ND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ వర్షంతో రద్దయితే ట్రోఫీ అందుకునేది ఎవరు?

Published : Mar 08, 2025, 04:23 PM IST

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ బిగ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఎవరికి కప్ దక్కుతుంది? 

PREV
15
ND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ వర్షంతో రద్దయితే ట్రోఫీ అందుకునేది ఎవరు?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో ఇండియా vs న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ బిగ్ ఫైట్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు ఈ ఐసీసీ టోర్నీని విజయవంతంగా ముగించడానికి ఫైనల్ పోరుకు సిద్ధంగా ఉంది. ఇక గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో ఓడిపోయింది. కానీ, అద్భుతమైన కమ్ బ్యాక్ తో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి మరోసారి భారత్ తో ఫైనల్ పోరుకు రెడీ అయింది. 

25
ఇండియా‍-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్

సెమీఫైనల్‌లో రోహిత్ శర్మ సేన బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. అలాగే, న్యూజిలాండ్ టీమ్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండు జట్లు ఫైనల్‌లో తలపడటం ఇది రెండోసారి.  అయితే, ఈ బిగ్ మ్యాచ్‌లో వర్షం కారణంగా రద్దు అయితే, ట్రోఫీని అందుకుని ఛాంపియన్ గా నిలిచేది ఎవరు? విజేతను ఎలా ఎంపిక చేస్తారు? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

35
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: మార్చి 9న వర్షం పడితే ఫైనల్ పరిస్థితి ఏంటి?

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం లేదు. కానీ వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు. ఎందుకంటే మనం ప్రకృతిని కంట్రోల్ చేయలేం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వర్షం పడితే, రిజర్వ్ డే (మార్చి 10) కేటాయించారు. కాబట్టి మార్చి 9న ఫలితం తేలకపోతే, మరుసటి రోజు మ్యాచ్ జరుగుతుంది.

ఒకవేళ రెండో రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. సెమీఫైనల్‌లో ఉన్న రూల్స్ ఇందులో వర్తిస్తాయా అని మీరు ఆలోచించవచ్చు. అంటే మ్యాచ్ రద్దు చేస్తే, ఎక్కువ పాయింట్లు పొందిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. అలాగే, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇప్పటివరకు ఎక్కువ పాయింట్లు పొందిన టీమ్ ట్రోఫీని అందుకుంటుందని మీరు అనుకోవచ్చు, కానీ, ఐసీసీ రూల్స్ లో అలాంటిదేమీ లేదు. 

45
ఐసీసీ రూల్

ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ ఏం రూల్స్ తీసుకువచ్చింది? 

ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ సాధ్యం కాకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీ కప్‌ను ఇద్దరు కెప్టెన్లకు సమంగా పంచుతారు. మ్యాచ్ జరగకపోతే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జాయింట్ రూల్‌ను అమలు చేస్తుంది. అయితే ఈ రూల్‌కు ముందు డీఎల్ఎస్ పద్ధతిని అమలు చేస్తారు. కానీ రెండు జట్లు 25 ఓవర్లు ఆడితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం.

55
ధోని కెప్టెన్సీలో ఛాంపియన్

2002వ సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు కప్‌ను పంచి ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో కూడా రిజర్వ్ డే కేటాయించారు. కానీ రెండు రోజులు కూడా వర్షం కురిసింది. ఆసారి కూడా ఇండియా ఫైనల్‌కు వచ్చింది, శ్రీలంకతో తలపడింది.

ఇండియా నాలుగోసారి ఈ సిరీస్ ఫైనల్‌కు వచ్చింది. దీనికి ముందు 2000 సంవత్సరంలో భారత జట్టు న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2002లో వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత 2013లో ధోని కెప్టెన్సీలో టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2017లో పాకిస్తాన్ టీమ్ భారత జట్టును ఓడించింది. కానీ ఇప్పుడు ఇండియాకు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలిచే అవకాశం వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories