IPL 2025: కోహ్లీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తారా? ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published : Mar 08, 2025, 10:19 AM ISTUpdated : Mar 08, 2025, 11:31 AM IST

Virat Kohli retirement: విరాట్ కోహ్లీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఆర్సీబీ త‌ర‌ఫున ఆడుతున్న కింగ్ కోహ్లీ 8 వేల‌కు పైగా ప‌రుగులు చేశాడు. 

PREV
15
IPL 2025: కోహ్లీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తారా? ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
Virat Kohli, RCB

Virat Kohli retirement: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (ఐపీఎల్ 2025) ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.

25

ఆర్సీబీ తర‌ఫున ఐపీఎల్ బ‌రిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ 

ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభానికి ముందు, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ (ఆర్సీబీ) మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన స్నేహితుడు, ర‌న్ మెసిన్ విరాట్ కోహ్లీ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇదే స‌మ‌యంలో అత‌ను చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. కోహ్లీ ఎప్పుడు ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడ‌నే విష‌యాల‌పై ఏబీ డివిలియ‌ర్స్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ లో ఆర్సీబీ త‌ర‌ఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో టాస్ స్కోర‌ర్ గా కొన‌సాగుతున్నాడు. అత‌ను ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 8 వేల‌కు పైగా ఐపీఎల్ ప‌రుగులు పూర్తి చేశాడు. 

35

ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేక‌పోయిన ఆర్సీబీ

ఐపీఎల్ లో ఆర్సీబీ సూప‌ర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క‌లిగి ఉంది. కింగ్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ 2025 ఐపీఎల్ టోర్నమెంట్‌లో ట్రోఫీని గెలుచుకోవాల‌ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇటీవ‌ల బెంగళూరు ఫ్రాంచైజీ ప్రతిభావంతులైన క్రికెటర్ రజత్ పాటిదార్ ను ఆర్సీబీ కెప్టెన్‌గా నియమించింది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఉండటం జట్టు ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని మరింత పెంచింది.

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో స్టార్ ఆటగాడు, అనేక మ్యాచ్‌లలో ఒంటి చేత్తో ఆర్సీబీని విజయాల వైపు నడిపించాడు. కానీ దురదృష్టవశాత్తు, బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. గత 18 సీజన్లుగా RCB జట్టులో అంతర్భాగంగా ఉన్న కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ సుదూర కలగా మిగిలిపోయింది.

45

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కాబోతున్నాడా? 

ఐపీఎల్ 2025 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీపై ఏబీ డివిలియ‌ర్స్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఏబీ డివిలియ‌ర్స్-విరాట్ కోహ్లీలు క‌లిసి ఆర్సీబీ త‌ర‌ఫున ఆడారు. వీరిద్ద‌రికి మంచి దోస్తాన్ ఉంది. విరాట్ కోహ్లీ తాజాగా ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌లు కురిపించాడు.

 "ఆర్సీబీ త‌ర‌ఫున ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అనేది ఇప్పటికే అసాధారణ కెరీర్‌ను కలిగి ఉన్న విరాట్ కోహ్లీకి సరైన ముగింపు అవుతుంది. గత ఐపీఎల్ టోర్నమెంట్‌లో అతను మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతని స్ట్రైక్ రేట్ అస్సలు సమస్య కాదు. జట్టుకు అవసరమైన దాని ప్రకారం అతను ఆడతాడు" అని ఏబీడీ అన్నాడు.

55
Virat Kohli, RCB, IPL 2025, IPL

అంటే కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌ని సూచ‌న‌లు అందించాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకోవడం సరైన ముగింపు అని చెప్పడం ద్వారా కింగ్ కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌నే విషయ‌న్ని చెప్పాడు. దీంతో ఇప్పుడు క్రికెట్ స‌ర్కిల్ లో కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ హాట్ టాపిక్ అవుతోంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ పై సెంచరీలో ఫామ్ ను అందుకుని టచ్ లోకి వచ్చాడు కింగ్ కోహ్లీ. న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తనదైన ఇన్నింగ్స్ ను ఆడిన భారత జట్టుకు ట్రోఫీని అందించాలని బరిలోకి దిగుతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories