టీమిండియాను చిత్తు చేసి, తీరతాం... పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెన్సేషనల్ కామెంట్స్...

First Published Sep 3, 2021, 3:54 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 సీజన్‌లో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ఇరుదేశాల ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో అక్టోబర్ 24న ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది... ఈ మ్యాచ్‌లో టీమిండియాను చిత్తు చేసి, టీ20 వరల్డ్‌కప్‌ను ఘనంగా ప్రారంభిస్తామని కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్...

‘టీ20 వరల్డ్‌కప్ కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పాక్ టీమ్‌తో పోలిస్తే, టీమిండియాపై ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. భారత్‌ను ఓడించి, ఈ మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం... వారిని ఓడించడం మాకు పెద్ద కష్టమేమీ కాదు...

ప్రస్తుతం వాళ్లు టెస్టులు ఆడుతున్నారు. టీ20 మ్యాచులు ఆడి, చాలా రోజులవుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆడతారు. ఒక్క జట్టుగా ఆడితేనే కదా టీమ్ పర్ఫామెన్స్ తెలిసేది...

యూఏఈలో మేం చాలా ఏళ్లుగా మ్యాచులు ఆడుతున్నాం. అది మాకు సొంత ఇంటి కంటే ఎక్కువే. టీ20 వరల్డ్‌కప్ 2021లో మేం కూడా ఫెవరెట్ టీమ్...’ అంటూ కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్...

ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కి అద్భుతమైన రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఏడు మ్యాచులు జరగగా ఏడింట్లోనూ టీమిండియా గెలిచింది... 

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ భారత్, పాకిస్తాన్ మధ్య ఐదు మ్యాచులు జరగగా, ఐదింట్లోనూ టీమిండియాకే విజయం దక్కింది. టీ20 వరల్డ్‌కప్ 2007లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగియగా... బాల్ అవుట్‌లో టీమిండియాకి గెలుపు దక్కింది...

టీ20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా... మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోగా, ఆ తర్వాతి 2009 టీ20 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ గెలిచింది...

ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ భారత జట్టుకే విజయం దక్కింది. ఆసియా కప్ 2018లో రెండు మ్యాచుల్లోనూ పాక్‌ని చిత్తు చేసిన భారత జట్టు, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌పై 89 పరుగుల తేడాతో విజయం అందుకుంది.

అయితే పాకిస్తాన్‌ని తక్కువ అంచనా వేయడం కూడా ప్రమాదమే క్రికెట్ విశ్లేషకులు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పరాజయం టీమిండియా చరిత్రలో అతి చెత్త ప్రదర్శనల్లో ఒకటిగా ఫ్యాన్స్‌కి పీడకలగా మిగిలిపోయింది...

click me!