ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు నన్ను అవమానించారు... షాకింగ్ విషయం బయటపెట్టిన సెహ్వాగ్...

Published : Sep 03, 2021, 03:07 PM IST

టెస్టు క్రికెట్‌కి బీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చిన టీమిండియా బ్యాట్స్‌‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్. టెస్టులను వన్డేల్లా ఆడే వీరూ, వన్డేలను టీ20ల్లా ఆడేవాడు. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్‌తో జరిగిన ఆరంగ్రేట మ్యాచ్‌లో జరిగిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు...

PREV
110
ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు నన్ను అవమానించారు... షాకింగ్ విషయం బయటపెట్టిన సెహ్వాగ్...

1999లో మోహాలీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...‘అప్పుడు నా వయసు 20, 21 ఏళ్లు ఉండొచ్చు. నేను బ్యాటింగ్‌ కోసం క్రీజులోకి వచ్చినప్పుడు షాహిదీ ఆఫ్రిదీ, షోయబ్ అక్తర్, యూసఫ్, ఇంకా పాకిస్తాన్ ప్లేయర్లు అందరూ నన్ను తిడుతూ స్వాగతం చెప్పారు...

210

వారిలో కొందరు నన్ను బూతులు తిట్టడం కూడా నాకు బాగా గుర్తుంది... అయితే నా ఫస్ట్ మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడిలో ఉన్న నేను, వాళ్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోయాను...

310

ఆ మ్యాచ్‌లో 20 నుంచి 25 వేల మంది మ్యాచ్ చూడడానికి వచ్చారు... వాళ్లందరి కళ్లు నన్నే చూస్తున్నాయనే ఆలోచన నన్నెంతో ఇబ్బందిపెట్టింది...

410

 నేను జట్టులో స్థిరమైన స్థానం సంపాదించిన తర్వాత నన్ను తిట్టిన ప్రతీ ఒక్కరికీ నా స్టైల్‌లో రిప్లై ఇవ్వడం మొదలెట్టాను...

510

2003-04 పాకిస్తాన్ టూర్‌లో ముల్తాన్‌లో త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత అదో రివెంజ్‌లా అనిపించింది. ఈ కారణంగానే పాకిస్తాన్‌తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా నాకు ఏదో తెలియని ఊపు, ఉత్సాహం వస్తాయి..’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

610

1999లో  మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సెహ్వాగ్ ఒక్క పరుగు మాత్రమే చేసి, షోయబ్ అక్తర్‌ బౌలింగ్‌లో రెండో బంతికే అవుట్ అయ్యాడు... 

710

బౌలింగ్‌లోనూ మూడు ఓవర్లలో 35 పరుగులు సమర్పించిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ మ్యాచ్ తర్వాత జట్టుకి దూరమయ్యాడు... 

810

మళ్లీ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన వీరూ...  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2001లో ఓపెనర్‌గా మారి, జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు.

910

ఆ తర్వాత 2003లో ముల్తాన్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా చరిత్రలో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

1010

ఆ ఇన్నింగ్స్ కారణంగా ‘ముల్తాక్ కా సుల్తాన్’గా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్, తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు...  251 వన్డేల్లో 15 సెంచరీలతో 8273 పరుగులు చేసిన వీరూ, 19 టీ20 మ్యాచుల్లో 394 పరుగులు చేశాడు.

click me!

Recommended Stories