ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా... జో రూట్ వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్..

Published : Sep 02, 2021, 11:12 PM ISTUpdated : Sep 02, 2021, 11:20 PM IST

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జో రూట్‌ను తొలిసారిగా స్వల్ప స్కోరుకే పెవిలియన్2కి చేర్చగలిగింది టీమిండియా. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్, జో రూట్‌ను అవుట్ చేశాడు. 53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్... టీమిండియా స్కోరుకి ఇంకా 138 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్.

PREV
17
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా... జో రూట్ వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్..

11 బంతుల్లో 5 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన జస్ప్రిత్ బుమ్రా... నాలుగో ఓవర్‌లోనే టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు... 

27

అదే ఓవర్‌లో ఆఖరి బంతికి హసీబ్ హమీద్ కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...

37

ఎప్పటిలాగే బౌండరీతో ఖాతా తెరిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, డేవిడ్ మలాన్‌తో కలిసి మూడో వికెట్‌కి 46 పరుగుల మెరుపు భాగస్వామ్యం నమోదుచేశాడు..

47

ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఉమేశ్ యాదవ్ విడదీశాడు. 25 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన జో రూట్, ఉమేశ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

57

రవీంద్ర జడేజా 2014లో జో రూట్‌ను బౌల్డ్ చేయగా, జస్ప్రిత్ బుమ్రా ఇదే సీజన్‌లో మూడో టెస్టులో బౌల్డ్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత జో రూట్‌ను బౌల్డ్ చేసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు ఉమేశ్ యాదవ్...

67

జో రూట్ వికెట్ ఉమేశ్ యాదవ్ కెరీర్‌లో 149వ వికెట్ కాగా... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా 99 వికెట్లతో ఉన్నాడు... తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది ఇంగ్లాండ్...

77

అంతకుముందు శార్దూల్ ఠాకూర్ మెరుపు హాఫ్ సెంచరీ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కారణంగా 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ 20+ పరుగులు కూడా చేయలేకపోయారు..

click me!

Recommended Stories