1. ముత్తయ్య మురళీధరన్
క్రికెట్ చరిత్రలో గొప్ప స్పిన్నర్లలో ఒకరు ముత్తయ్య మురళీధరన్. ఈ శ్రీలంక స్టార్ బౌలర్ తన అద్భుత బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. తన సూపర్ బౌలింగ్ తో ప్రపంచంలోని దిగ్గజ బ్యాట్స్‌మెన్ లను సైతం వణికించాడు. క్రికెట్ లో చాలా రికార్డులు సృష్టించిన ముత్తయ్య మురళీధరన్ టెస్టు, వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు.
ఏ బ్యాట్స్‌మెన్ అయినా ముత్తయ్య గూగ్లీ, 'దూస్రా' ఆడటం అంత సులభం కాదు. ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు, వన్డే క్రికెట్‌లో 534 వికెట్లు తీశాడు. అతను తన టెస్ట్ కెరీర్‌లో చివరి బంతికి భారత ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా వికెట్ తీశాడు. ఇలా తన కెరీర్ చివరి బంతికి కూడా వికెట్ తీసిన గొప్ప బౌలర్లలో ఒకరిగా నిలిచారు. శ్రీలంక జట్టుకు ఒంటిచేత్తో అనేక విజయాలు అందించాడు.