ఒక్క ప‌రుగు.. రిష‌బ్ పంత్ గుండె ముక్కలైంది

First Published | Oct 19, 2024, 5:05 PM IST

1 run broke Rishabh Pant's heart : బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-బంగ్లాదేశ్ టెస్టులో రిష‌బ్ పంత్ ధోని రికార్డును అధిగ‌మించాడు. అయితే, టెస్టు క్రికెట్ లో రిష‌బ్ పంత్ ను చాలా సార్లు ఒక్క ప‌రుగు.. ఒకే ఒక్క ప‌రుగు అత‌ని గుండెను ముక్క‌లు చేసింది.
 

1 run broke Rishabh Pant's heart : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో 46 పరుగులు మాత్రమే చేసింది. భార‌త ఆట‌గాళ్లు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా వ‌రుస‌గా వికెట్లు చేజార్జుకుని పెవిలియ‌న్ కు చేరారు.

అయితే, రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ 35 ప‌రుగులు, రోహిత్ శ‌ర్మ 52 ప‌రుగులు చేశాడు. ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ 70 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ను బాదాడు. అత‌నికి తోడుగా దూకుడుగా బ్యాటింగ్ చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అద్భుతమైన సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 150 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 18 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. 

ఒక్క ప‌రుగు దూరంలో రిష‌బ్ పంత్ సెంచ‌రీ మిస్ 

న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసింది. దీంతో ఆ జ‌ట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ మంచి ప్ర‌ద‌ర్శ చేస్తూ అద్భుతంగా పున‌రాగ‌మం చేసింది టీమిండియా. మూడో రోజుతో పాటు  నాలుగో రోజు ఆటలో కూడా భారత బ్యాట్స్‌మెన్ అద్భుతం చేశారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా 150 పరుగులు చేశాడు.

అలాగే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పంత్ దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. 99 పరుగులు చేసిన తర్వాత ఫాస్ట్ బౌలర్ విలియం ఓ రూర్క్ బౌలింగ్ లో పంత్ ఔటయ్యాడు. అంటే కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. విలియమ్ వేసిన బంతి కొద్దిగా బౌన్స్ అవడంతో పంత్ బౌల్డ్ అయ్యాడు.


ఇప్ప‌టికీ ఏడు సార్లు 90+ లో ఔట్ అయిన రిష‌బ్ పంత్ 

రిష‌బ్ పంత్ 90+ ప‌రుగుల‌తో ఔట్ కావ‌డం బెంగ‌ళూరు టెస్టు మొద‌టిది మాత్రం కాదు. ఇప్ప‌టికే చాలా సార్లు ఇలా ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో తొంభైలలో ఏడుసార్లు ఔట్ అయ్యాడు. ఈ ఏడు సందర్భాలలో పంత్ నైంటీలకు బలికాకుంటే, అతని సెంచరీల సంఖ్య 13 అయ్యేది. ఈ మ్యాచ్‌లో పంత్ సెంచరీ చేసి ఉంటే, టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచేవాడు. ప్రస్తుతం పంత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సమానంగా ఉన్నాడు. ధోనీ, పంత్‌లు 6-6 టెస్టు సెంచరీలు చేశారు.

టెస్ట్ క్రికెట్‌లో రిషబ్ పంత్ 90+ ఔట్లు ఇవే 

99 పరుగులు vs న్యూజిలాండ్, బెంగళూరు 2024
93 పరుగులు vs బంగ్లాదేశ్ మీర్పూర్ 2022
96 పరుగులు vs శ్రీలంక, మొహాలీ 2022
91 పరుగులు vs ఇంగ్లండ్, చెన్నై 2021
97 పరుగులు vs ఆస్ట్రేలియా, సిడ్నీ 2021
92 ప‌రుగులు vs వెస్టిండీస్, హైద‌రాబాద్ 2018
92 పరుగులు vs వెస్టిండీస్, హైదరాబాద్ 2018

మొత్తంగా టెస్టు క్రికెట్‌లో 99 పరుగుల వద్ద ఔట్ అయిన రెండో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్. అంతకుముందు 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఈ అవాంఛనీయ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఓవరాల్‌గా 99 పరుగులతో ఔట్ అయిన పదో భారత బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. ఎంఎల్ జైసింహ, పంకజ్ రాయ్, వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రుసీ సూర్తి, మురళీ విజయ్, అజిత్ వాడేకర్, సౌరవ్ గంగూలీ, ధోనీలు ఈ జాబితాలో ఉన్నారు.

ఒక్కపరుగు దూరంలో సెంచరీ కోల్పోయిన రిషబ్ పంత్ 

బెంగళూరు టెస్టులో రిషబ్ పంత్ ఒక్క పరుగు దూరంలో తన సెంచరీని కోల్పోయాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో 90+  పరుగుల వద్ద అత్యధిక ఔట్‌లు అయిన ప్లేయర్ల వివరాలు గమనిస్తే టాప్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతని తర్వాత రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్ లు ఉన్నారు. 

టెస్టు క్రికెట్ లో 90+ లో ఎక్కువ సార్లు ఔట్ అయిన ప్లేయ‌ర్లు 

10 - సచిన్ టెండూల్కర్
9 - రాహుల్ ద్రవిడ్
7 - రిషబ్ పంత్
5 - సునీల్ గవాస్కర్
5 - ఎంఎస్ ధోని
5 - వీరేంద్ర సెహ్వాగ్

Latest Videos

click me!