ఇండియా-విండీస్ టెస్టు సిరీస్‌కు ఐసీసీ క్వాలిఫయర్ అడ్డం.. రీషెడ్యూల్ చేయాల్సిందేనా..?

Published : Jun 22, 2023, 12:08 PM IST

WI vs IND: భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు వెళ్లనుంది. అక్కడ  వెస్టిండీస్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లో పాల్గొననుంది. 

PREV
16
ఇండియా-విండీస్ టెస్టు సిరీస్‌కు  ఐసీసీ క్వాలిఫయర్  అడ్డం.. రీషెడ్యూల్ చేయాల్సిందేనా..?

డబ్ల్యూటీసీ  ఫైనల్ తర్వాత   నెల రోజులకు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్ తో జులై 12 నుంచి మొదలయ్యే తొలి టెస్టులో పాల్గొననుంది.  జులై మొదటివారంలో విండీస్ కు బయల్దేరే భారత జట్టు..  12 నుంచి  డొమినికా వేదికగా ఫస్ట్ టెస్ట్ ను ఆడనుంది.  

26

అయితే ఈ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.  దీనికి కారణం  జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్  మ్యాచ్ లే.. ఇటీవలే మొదలైన ఈ మ్యాచ్ లలో వెస్టిండీస్ కూడా పాల్గొంటున్నది. 

36

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్  మ్యాచ్ లు ఆడుతున్న వెస్టిండీస్..  సూపర్ సిక్సెస్ దశకు  చేరుకుంటే  అప్పుడు  జులై 9 దాకా జింబాబ్వేలోనే ఉండాల్సి వస్తుంది.   జులై 12 నే భారత్ - వెస్టిండీస్ లు తొలి టెస్టు ఆడాల్సి ఉంది. అయితే  జింబాబ్వే నుంచి నేరుగా వెస్టిండీస్ కు వచ్చినవెంటనే  మ్యాచ్ లు ఆడించడం కూడా కష్టమేనన్న ఆందోళనలు  క్రికెట్ వెస్టిండీస్ ను వెంటాడుతున్నాయి. 

46

అయితే   ప్రస్తుతం   మూడు ఫార్మాట్లకు మూడు జట్లనూ మెయింటెన్ చేస్తున్న టీమ్స్ లో వెస్టిండీస్ కూడా ఉంది. టెస్టులు ఆడేందుకు ఆ జట్టుకు  సెపరేట్ టీమ్ ఉంది. కానీ రెండు ఫార్మాట్లూ ఆడే ఆటగాళ్లు పలువురు ఉన్నారు. వీరి గురించే  విండీస్ ఆందోళన చెందుతున్నది. 

56
Image credit: Getty

విండీస్  వన్డే టీమ్ లో సభ్యులుగా ఉన్న కైల్ మేయర్స్,  జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్,  రోస్టన్ ఛేజ్ లు టెస్టులలో కూడా కీలకం. వీరిని   క్వాలిఫయర్ మ్యాచ్ లు ముగిసిన వెంటనే సూపర్ సిక్సెస్ ఫైనల్ ఫేజ్ కు ముందే  విండీస్ కు రప్పించేందుకు   క్రికెట్ వెస్టిండీస్ సన్నాహకాలు చేస్తున్నది.  

66

తమకు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ తో పాటు  భారత్ తో సిరీస్ ముఖ్యమని..  అందుకే  రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటామని   క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధి ఒకరు తెలిపాడు. టెస్టు ప్లేయర్లపై భారం పడనీయకుండా  చూస్తామని కూడా  ఆయన చెప్పాడు.  

click me!

Recommended Stories