బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్... అప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా రమ్మంటేనే కాదని!

Published : Jun 22, 2023, 11:57 AM IST

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మ, స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కయ్యి, ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ని నియమించలేదు బీసీసీఐ. ప్రస్తుతం ఆ పొజిషన్‌ కోసం వెతుకులాట మొదలెట్టింది బీసీసీఐ...  

PREV
16
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్... అప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా రమ్మంటేనే కాదని!
CHETAN SHARMA

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా సెలక్షన్ బోర్డు సభ్యులతోనే కథ నడిపించింది బీసీసీఐ. అయితే ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టీమ్ ఎంపిక చేసేందుకు ఓ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ అవసరం...

26
Virender Sehwag

నార్త్ జోన్ నుంచి బీసీసీఐ సెలక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు ఛేతన్ శర్మ. దీంతో అదే జోన్ నుంచి చీఫ్ సెలక్టర్‌ని ఎంపిక చేయాలని భావిస్తోంది బీసీసీఐ. దీంతో నార్త్ జోన్‌లో బిగ్గెస్ట్ మాజీ క్రికెటర్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్‌ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా తీసుకురావాలని బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టిందట..

36
Virender Sehwag

అయితే 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌కి, రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆశ చూపించినా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

46
Virender Sehwag

ప్లేయర్‌గా సంపాదించుకున్న గౌరవాన్ని టీమిండియా హెడ్ కోచ్‌గా పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఆ పదవి తీసుకోలేదని వ్యాఖ్యానించాడు వీరూ. దీంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి తీసుకోవడానికి అతను ఒప్పుకుంటాడా? అనేది అనుమానమే..

56

సెహ్వాగ్, చీఫ్ సెలక్టర్ బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే టీమిండియా తరుపున 23 టెస్టులు ఆడిన మాజీ క్రికెటర్ శివ్ సుందర్ దాస్‌, చేతన్ శర్మ ప్లేస్‌లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది..

66

సీనియర్ సెలక్షన్ ప్యానెల్‌కి ఛైర్మెన్‌గా ఉండే చీఫ్ సెలక్టర్‌కి బీసీసీఐ ఏడాదికి రూ.1 కోటి పారితోషికంగా చెల్లిస్తుంది. మిగిలిన నలుగురు సభ్యులకు ఏడాదికి రూ.90 లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ. 

click me!

Recommended Stories