కోహ్లీ, రోహిత్ కూడా వద్దు! మొత్తం కొత్త వాళ్లనే తీసుకోండి... వెస్టిండీస్ టూర్‌ టీమ్ సెలక్షన్‌ విషయంలో...

Published : Jun 22, 2023, 11:28 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రెండు సార్లు టీమిండియాకి నిరాశే ఎదురైంది. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతుల్లో ఫైనల్‌ ఓడిన టీమిండియా, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది...  

PREV
18
కోహ్లీ, రోహిత్ కూడా వద్దు! మొత్తం కొత్త వాళ్లనే తీసుకోండి... వెస్టిండీస్ టూర్‌ టీమ్ సెలక్షన్‌ విషయంలో...
Virat Kohli-Rohit Sharma

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత 2023-25 సీజన్‌ని వెస్టిండీస్‌ టూర్‌తో మొదలెట్టబోతోంది భారత జట్టు. ఈ సీజన్‌ ఫైనల్ 2025లో జరగనుంది. ఆ సమయానికి కొత్త టెస్టు టీమ్‌ని తయారుచేయాలని సెలక్టర్లను కోరుతున్నాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

28

‘ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకి గేమ్ ఛేంజర్లుగా మారారు. వాళ్లు టీ20 క్రికెట్‌ ఆడడం మానేశారు. అప్పుడప్పుడూ ఆడినా పొట్టి ఫార్మాట్ ఆడేది చాలా తక్కువే....
 

38
Kohli-Rohit

టీమిండియా కూడా టీ20 క్రికెట్ ఆడడానికి ప్రాధాన్యం ఇవ్వని టెస్టు టీమ్‌ని తయారుచేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ వల్ల టెస్టు క్రికెట్‌కి చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలి...
 

48

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాగా ఆడుతున్న ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. పరుగులు మాత్రమే కాదు, భారత జట్టుకి ఫ్యూచర్ టెస్టు ప్లేయర్లుగా విదేశాల్లో కూడా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్లను సెలక్టర్లు వెతికి పట్టుకోవాలి...
 

58

వెస్టిండీస్ టూర్‌లో కనీసం ముగ్గురు కొత్త బ్యాటర్లకు, ముగ్గురు కొత్త ఫాస్ట్ బౌలర్లకు అవకాశం దక్కాలని కోరుకుంటున్నా. అవసరమైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లను కూడా పక్కనబెట్టేయండి. ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నారని కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నవారిని టెస్టు టీమ్‌కి సెలక్ట్ చేయండి...

68
Image credit: PTI

జాగ్రత్తగా గమనిస్తే దేశవాళీ క్రికెట్‌లో నెం.3, 4, 5 స్థానాల్లో అద్భుతమైన టెక్నిక్‌తో రాణిస్తున్న ప్లేయర్లు చాలామంది కనిపిస్తారు. ఇప్పుడు టీమిండియాకి కావాల్సింది వాళ్లే. కొన్ని నెలల క్రితం టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ చాలా పటిష్టంగా కనిపించింది..

78

ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా గాయపడగానే ఫాస్ట్ బౌలర్లే కరువయ్యారు. ప్రసిద్ధ్ కృష్ట లాంటి కుర్రాళ్లు, టెస్టుల్లో బాగా రాణించగలరు. ఏ ప్లేయర్‌ అయినా గాయపడితే బ్యాకప్ సిద్ధంగా పెట్టుకోవాలి. జోష్ హజల్‌వుడ్ గాయపడితే స్కాట్ బోలాండ్ ఎలా ఆడాడు...

88

ఉమేశ్ యాదవ్‌ ఉన్నా అతని వల్ల టీమ్‌కి ఒరిగిందేమీ లేదు. స్కాట్ బోలాండ్ చూపించిన ఇంపాక్ట్, ఉమేశ్ యాదవ్ నుంచి రాలేదు. టీమిండియా ఓటమికి ఇది కూడా ఓ కారణం. ఫాస్ట్ బౌలింగ్‌ బ్యాకప్ చాలా అవసరం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..

Read more Photos on
click me!

Recommended Stories