IPL 2026 Final: ఔటా? నాటౌటా? వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వివాదం.. అంపైర్ డెసిషన్‌తో హైడ్రామా !

Published : May 31, 2026, 09:43 PM IST

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో వాషింగ్టన్ సుందర్ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆర్సీబీ ఆటగాళ్లు అంపైర్లతో వాదనకు దిగారు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
అది పక్కా అవుట్.. అంపైర్‌తో రజత్ పాటిదార్ ఫైట్.. కోహ్లీ రియాక్షన్ వైరల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఒకే ఒక్క అంపైరింగ్ నిర్ణయం మ్యాచ్‌లోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారింది. గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ అవుట్ చుట్టూ తిరిగిన ఈ సీన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ మధ్య పెద్ద రచ్చకు దారితీసింది.

25
షార్ట్ పిచ్ ప్లాన్.. జోర్డాన్ కాక్స్ సూపర్ డైవ్

ఫైనల్ మ్యాచ్ అంటేనే ప్రెజర్ మామూలుగా ఉండదు. అందుకే గుజరాత్ బ్యాటర్లను దెబ్బకొట్టేందుకు బెంగళూరు ఒక పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగింది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టాలనేది ఆర్సీబీ స్కెచ్. జేకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఆఖరి బంతికి సరిగ్గా ఇదే జరిగింది.

డఫీ వేసిన ఫాస్ట్ షార్ట్ పిచ్ బాల్‌ను గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాలని ట్రై చేశాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ కాక్స్ గాల్లోకి దూకుతూ ఒక అద్భుతమైన లో-క్యాచ్ అందుకున్నాడు.

35
అంపైర్ల తడబాటు.. ఆర్సీబీ సంబరాలు.. అంతలోనే

జోర్డాన్ కాక్స్ క్యాచ్ పట్టగానే ఆర్సీబీ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. వికెట్ పడిపోయిందని సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌కు ఈ క్యాచ్‌పై కాస్త డౌట్ వచ్చింది. దాంతో ఆయన వాషింగ్టన్ సుందర్‌ను గ్రౌండ్ వీడకుండా అక్కడే వెయిట్ చేయమని చెప్పి, డెసిషన్‌ను థర్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్‌కు రిఫర్ చేశారు. బిగ్ స్క్రీన్‌పై రీప్లేలను రకరకాల యాంగిల్స్ నుండి చూసినప్పుడు అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

45
నాట్ అవుట్ వెనుక ఉన్న రూల్ ఏంటి?

రీప్లేలో కాక్స్ చేతుల్లో బంతి ఉన్నట్లు కనిపించినా.. అతను నేలపైకి డైవ్ చేసినప్పుడు బంతి గడ్డిని తాకుతున్నట్లు క్లియర్ గా అనిపించింది. క్రికెట్ రూల్స్ ప్రకారం.. ఫీల్డర్ బంతిపై, తన మూవ్‌మెంట్స్‌పై పూర్తి కంట్రోల్ సాధించే వరకు బంతి నేలకి తగలకూడదు. ఇక్కడ కాక్స్ వేళ్లు బంతి కింద ఉన్నప్పటికీ, అవి బంతిని పూర్తిగా కవర్ చేయలేదు. దాంతో బంతి భూమిని తాకినట్లు థర్డ్ అంపైర్ భావించారు. క్యాచ్ క్లీన్‌గా ఉన్నట్లు లేకపోవడంతో థర్డ్ అంపైర్ స్క్రీన్ పై నాట్ అవుట్ అని ప్రకటించారు.

55
ఆర్సీబీ ప్లేయర్స్ షాక్.. మైదానంలో వాదనలు

థర్డ్ అంపైర్ నిర్ణయంతో వాషింగ్టన్ సుందర్ ఊపిరి పీల్చుకోగా, ఆర్సీబీ క్యాంప్ మాత్రం షాక్‌కు గురైంది. కాక్స్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నప్పుడు అది పక్కా అవుట్ కదా అని ఆర్సీబీ వాదన. ఈ డెసిషన్‌పై కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్ నితిన్ మీనన్ దగ్గరకు వెళ్లి చాలా సేపు వాదించాడు.

మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ నిర్ణయం చూసి షాకైపోయాడు. అంపైర్లు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడ్డారు. దీంతో వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో జీటీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లలో ఇలాంటి టెక్నికల్ వివాదాలు మొత్తం ఆట గమనాన్నే మార్చేస్తుంటాయి. మరి ఈ ఒక్క డెసిషన్ ఈ మ్యాచ్ రిజల్ట్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories