హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జట్టు పరిస్థితులు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌కు సహకరిస్తే, నితీష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా ఎంపికయ్యాడు. అయితే అతని లభ్యత కూడా ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది.
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.