Mohammed Shami , shami
What happened to Mohammed Shami: ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్న 33 ఏళ్ల టీమిండియా స్టార్ బౌలర్ షమీ చివరిసారిగా గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు.
ఆ తర్వాత గాయం కారణంగా షమీ భారత తరఫున ఎలాంటి మ్యాచ్ లను ఆడలేదు. క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు. దీనికి ప్రధాన కారణం గాయాలపాలు కావడం. అయితే, షమీ కోలుకున్నాడనీ, భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఆడతాడని భావించారు.
కానీ, గాయం తీవ్రత తగ్గకపోవడంతో ఈ సిరీస్ కు కూడా దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ వచ్చే నెలలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు దూరమయ్యాడనీ, అతను యూకేలో శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెళ్లనున్నాడని పీటీఐ నివేదికలు పేర్కొన్నాయి.
Mohammed Shami
షమీ చివరిసారిగా గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. చీలమండ గాయం కారణంగా అప్పటి నుంచి అతను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.
Mohammed Shami
అయితే, షమీ ప్రత్యేక చీలమండ చికిత్స కోసం జనవరి చివరి వారంలో లండన్ వెళ్లాడనీ, మూడు వారాల తర్వాత లైట్ రన్నింగ్ స్టార్ట్ చేసి తర్వాత మళ్లీ చికిత్స తీసుకోవచ్చని వైద్యులు తెలిపారని సమాచారం.
చికిత్సకు ఉపయోగించిన ఇంజెక్షన్ పని చేయలేదనీ, ఇప్పుడు షమీకి మిగిలింది శస్త్రచికిత్స మాత్రమేనని వైద్యులు తెలిపినట్టు సంబంధిత రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే షమీ శస్త్రచికిత్స కోసం త్వరలోనే యూకే వెళ్లనున్నారనీ, ఐపీఎల్ ఆడటమూ కష్టమేనని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపినట్టు పీటీఐ నివేదించింది.