విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

First Published | Feb 21, 2024, 9:02 AM IST

Virat Kohli's son Akaay: భార‌త స్టార్ క‌పుల్ విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంప‌తులు మ‌రో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. వామిక అనే కుతురుతో పాటు రెండో సంతానమైన త‌మ కుమారుడికి 'అకాయ్' అని పేరుపెట్టారు విరుష్క దంప‌తులు. 
 

meaning of Virat Kohli's son's name Akaay: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లువిరిసింది. భార‌త స్టార్ క‌పుల్ విరాట్-అనుష్కలు రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు.

Virat Kohli and Anushka Sharma

ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ వారు సోష‌ల్ మీడియాలో వారి ఆనందాన్ని పంచుకున్నారు. త‌మ బిడ్డ‌కు అకాయ్ అనే పేరు పెట్టారు. ఇప్ప‌టికే విరుష్క దంప‌తుల‌క వామిక అనే కూతురు కూడా ఉంది. విరాట్ అనుష్క దంప‌తులు ఈ శుభవార్త చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వారిద్దరూ తమ స్నేహితులు, అభిమానుల నుండి చాలా అభినందనలు అందుకుంటున్నారు.


ఇద్దరు స్వయంగా తమ రెండో బిడ్డ రాకను ప్రకటించారు. వారి ప్రకటనలో "చాలా ఆనందం.. ప్రేమతో, ఫిబ్రవరి 15న మా ఇంట్లో ఒక అబ్బాయి.. వామికా సోదరుడు అకాయ్ జన్మంచాడ‌ని మేము ప్రకటిస్తున్నాము. ఈ విషయంలో ఆశీస్సులు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. మీరు మాకు గోప్యతకు అండ‌గా ఉంటార‌ని కోరుకుంటున్నాము.. ప్రేమ‌తో విరాట్ అనుష్క" అని పేర్కొన్నారు. వీరిద్దరి ప్రకటన వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. జూనియ‌ర్ విరాట్ కోమ్లీ అకాయ్ అశీస్సులు, విరుష్క‌ల‌కు శుభాకాంక్షలు అందుతున్నాయి.

Valentine Day

విరాట్ కోడుకు పేరు "అకాయ్" అంటే అర్థం ఏమిటి?  హిందీలో అకాయ్ అంటే నిరాకారమని, అంటే రూపం లేనిదని ప‌లువురు చెబుతున్నారు. అలాగే, టర్కీలో భాష‌లో అకాయ్ అంటే మెరుస్తున్న చంద్రుడు అని అర్థం. గతంలో విరాట్, అనుష్క దంపతులు తమ కుమార్తెకు దుర్గాదేవి పేరు మీద వామిక అని పేరు పెట్టారు.

కాగా, భార‌త్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకోవ‌డానికి వారి రెండో సంతానం రాబోతుండ‌ట‌మేన‌ని ఇటీవ‌ల చ‌ర్చ సాగింది. అనుష్క తన రెండవ బిడ్డతో గర్భవతి అని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, వారు ఈ విష‌యాన్ని ధృవీక‌రించ‌లేదు. అయితే, దక్షిణాఫ్రికా ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ ఈ విష‌యాన్ని  చెప్పారు.

కాగా, విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలు 11 డిసెంబర్ 2017న వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఇటలీలోని టుస్కానీలో సన్నిహిత వేడుకలో జరిగింది. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. మూడు సంవత్సరాల వివాహం తర్వాత, జనవరి 11, 2021 న, విరాట్-అనుష్కలకు వామిక అనే కుమార్తె జన్మించింది. ఇప్పుడు వారిద్దరికీ ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. 

Latest Videos

click me!