ఐపీఎల్ 2024 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా..?

First Published Feb 20, 2024, 9:45 PM IST

IPL 2024: క్రికెట్ ప్రియుల‌కు మ‌రో గుడ్ న్యూస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం గురించి ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారిక వివరాలు వెల్లడించారు. 
 

ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్, ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 విజయవంతమైన ఎడిషన్‌లను పూర్తి చేసి 17వ ఎడిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ 2024 సీజ‌న్ కు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

ipl

2024 ఐపీఎల్ టోర్నమెంట్‌కు ముందే ఆటగాళ్ల వేలం ముగిసింది. రాబోయే ఐపీఎల్ టోర్నమెంట్‌లో మొత్తం 10 ఫ్రాంచైజీలు కప్ గెలవాలని ప్లాన్ చేస్తున్నాయి.

IPL, TATA, TATA IPL

ఐపీఎల్ టోర్నమెంట్ ఎప్పుడు మొదలవుతుందనే ఉత్సుకతకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెర లేపారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

ఈ సమయంలోనే భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో టోర్నీని విదేశాల్లో నిర్వ‌హిస్తార‌నే టాక్ న‌డిచింది. అయితే, దీనిపై క్లారిటీ ఐపీఎల్ టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించిన‌ట్టు అరుణ్ ధుమాల్ తెలిపారు.

rcb

మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి మేము ఎదురుచూస్తున్నాము. మేము ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. "మేము ముందుగా ఐపీఎల్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుదల చేయబోతున్నాం" అని అరుణ్ ధుమాల్ పీటీఐతో తెలిపారు.

MS Dhoni

ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాబోయే ఐపీఎల్ షెడ్యూల్ ను రెండు భాగాలుగా విభ‌జించారు. ఐపీఎల్ టోర్నీ తొలి 15 రోజుల షెడ్యూల్‌ని విడుదల చేయబోతున్నామ‌నీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని అరుణ్ ధుమాల్ వెల్ల‌డించారు.
 

ప్ర‌స్తుతం విడుద‌ల చేయ‌బోతున్న ఐపీఎల్ 2024 సీజ‌న్ స‌మ‌యంలో భార‌త లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. కానీ, ఎన్నిక‌ల షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ నిర్వ‌హ‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ లోనే ఐపీఎల్ 2024ను నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. 

మొత్తం ఐపీఎల్ టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందు 2009లో, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఐపిఎల్ టోర్నమెంట్ భారతదేశం వెలుపల అంటే దక్షిణాఫ్రికాలో జరిగింది.

అలాగే, 2014లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటికీ ఐపీఎల్ టోర్నీలో సగం మాత్రమే దుబాయ్‌లో జరిగింది. మిగతా సగం భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ జరగనున్నందున మే 26న ఐపీఎల్ ఫైనల్ జరిగే అవకాశం ఉందని సమాచారం.

click me!