అందుకే ధోనీ కంటే సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్... ‘దాదా’ టీమిండియాలో తెచ్చిన మార్పు...

First Published Jul 8, 2021, 9:39 AM IST

భారత క్రికెట్‌లో గ్రేట్ కెప్టెన్ ఎవ్వరంటే మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీల పేర్లే చెబుతారు ఎక్కువమంది. అయితే క్రికెట్ విశ్లేషకుల దృష్టిలో మాత్రం మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ధోనీ కంటే గంగూలీ ఎప్పటికీ గ్రేటే... ఎందుకంటే...

రాహల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకునే సమయానికి భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు...
undefined
అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి పరిస్థితి వేరు. మ్యాచ్ ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకుని, వరుస ఓటములతో ఓ వీక్ టీమ్‌గా ఉన్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ...
undefined
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ ర్యాంకు నుంచి 2వ ర్యాంకుకు ఎగబాకింది. అన్నింటికీ మించి జట్టులో గెలుపు కసిని నింపిన సారథి గంగూలీయే..
undefined
అప్పటిదాకా ఉన్న కెప్టెన్లు ఒక ఎత్తు, గంగూలీ మరో ఎత్తు... ఎందుకంటే తన దూకుడుతో ప్రత్యర్థి జట్లను వణికించిన గంగూలీ, మ్యాచ్ ఫిక్సర్ల గుండెల్లో గుబులు పుట్టించాడు...
undefined
మ్యాచ్ ఫిక్సింగ్ కోసం గంగూలీతో మాట్లాడాలంటేనే భయపడేవాళ్లమంటూ పోలీసులకు చిక్కిన ఓ బుకీ స్వయంగా ప్రకటించాడంటే, అతను జట్టును ఎంత క్రమశిక్షణతో నడిపించారో అర్థం చేసుకోవచ్చు...
undefined
ధోనీలాగే గంగూలీపైన కూడా ‘క్రెడిట్ స్టీలర్’ అంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే గంగూలీ క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం..
undefined
లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ, తొలి టెస్టులోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. లార్డ్స్ మైదానంలో తొలి మ్యాచ్ ఆడుతూ అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్‌గా 25 ఏళ్లు నిలిచిన దాదా రికార్డును ఈ ఏడాది డివాన్ కాన్వే బద్దలు కొట్టాడు...
undefined
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లకి రోల్‌ మోడల్‌గా నిలిచిన దాదా... ఇప్పటిదాకా వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల నుంచి 11 వేల దాకా పూర్తిచేసుకున్న ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
undefined
ఆరంగ్రేటం ఇచ్చిన కొత్తలో 1997 నుంచి 2000 దాకా వరుసగా నాలుగేళ్లు వన్డేల్లో 1300+ పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, ఈ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్‌ను వరుసగా రెండేళ్లు సాధించకపోవడం విశేషం...
undefined
1997లో 1338 పరుగులు చేసిన దాదా, 1998లో 1328, 1999లో 1767 పరుగులు, 2000వ సంవత్సరంలో 1579 పరుగులు సాధించాడు...
undefined
113 టెస్టుల్లో 16 సెంచరీలతో 7212 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, 311 వన్డేల్లో 22 సెంచరీలతో 11,363 పరుగులు చేశాడు...
undefined
అన్ని ఉన్న జట్టును అద్భుతంగా నడిపించి, రెండు వరల్డ్‌కప్‌లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కంటే, అనేక కష్టాల్లో ఉన్న టీమ్‌ను బలమైన జట్టుగా మార్చి, 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ దాకా చేర్చిన గంగూలీ గ్రేట్ కెప్టెన్ అంటాడు మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్.
undefined
click me!