ధోనీ, యువరాజ్ సింగ్ మధ్య గొడవలు రావడానికి ఆమే కారణమా? దీపికా పదుకొనేతో ప్రేమాయణం వల్లే...

First Published | Jul 7, 2021, 12:21 PM IST

భారత జట్టుకి కెప్టెన్‌గా మూడు ఐసీసీ టోర్నీలు అందించినా మహేంద్ర సింగ్ ధోనీకి కోట్ల సంఖ్యలో హేటర్స్ ఉన్నారు. మాహీకి ఇంతటి యాంటీ ఫ్యాన్స్ రావడానికి కారణం యువరాజ్ సింగ్ కూడా. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ధోనీ, యువరాజ్ ఎందుకు విడిపోయారు. వీరిద్దరూ దీపికా పదుకొనేతో నడిపిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ‌ నిజమేనా...

మొదటి మ్యాచ్‌లో సున్నాకే రనౌట్ అయిన ధోనీ, తన ఆఖరి మ్యాచ్‌లోనూ రనౌట్ రూపంలోనే పెవిలియన్ చేరాడు. రెండు రనౌట్స్ మధ్య ధోనీ, ఇంటర్నేషనల్ కెరీర్ అత్యద్భుతంగా సాగింది...
వైజాగ్‌‌లో పాకిస్థాన్‌‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన మహేంద్ర సింగ్ ధోనీ... వన్‌డౌన్‌లో వచ్చి 148 పరుగులు చేసి, అదరగొట్టాడు...

ఆ ఇన్నింగ్స్‌తో భారత జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్న ధోనీ... ఆ తర్వాత కొన్ని సునామీ ఇన్నింగ్స్‌లు ఆడి ఫ్యాన్స్‌కి ఫెవరెట్ క్రికెటర్‌గా మారిపోయాడు...
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య స్నేహం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడేవాళ్లు. వీరిద్దరూ కలిసి కొన్ని మధురమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత జట్టుకి విజయాలను అందించారు.
ఈ ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది... బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారు. ధోనీ సెంచరీ చేస్తే, యువీ సెలబ్రేట్ చేసుకునేవాడు. యువరాజ్ సింగ్‌తో ధోనీ కలిసి చిందులు వేసేవాళ్లు, క్రీజులో అల్లరి చేసేవాళ్లు...
సరిగ్గా ఇదే సమయంలో విడుదలైంది షారుక్ ఖాన్ నటించిన ‘ఓమ్ శాంతి ఓమ్’... ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొనే, తన అందంతో సొగసైన కళ్లతో యూత్‌ను అట్రాక్ట్ చేసింది...
ఇదే టైంలో ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి, దీపికా పదుకొనేకి ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారింది. ధోనీ, దీపికా పదుకొనే కలిసి కొన్ని ఈవెంట్లకు హాజరయ్యారు కూడా...
వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ సమయంలోనే దీపికా పదుకొనేను చూసిన యువరాజ్ సింగ్ కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు...
తన స్నేహితుడు మనసు పడడంతో ధోనీ, దీపికాను త్యాగం చేశాడని వార్తలు వచ్చాయి... జాతీయ మీడియాలో ధోనీ, దీపికా, యువరాజ్ సింగ్... ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ గురించి చాలా వార్తలే వచ్చాయి...
స్వయంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌నే ఈ విషయం గురించి ప్రశ్నించారు చాలామంది రిపోర్టర్లు... దీనికి ఫన్నీగా సమాధానం చెప్పాడు షారుక్... ‘దీపికా, యువీది కాదు, ధోనీది కాదు... నాది... నా సినిమాలో హీరోయిన్ తను’ అని చెప్పాడు షారుక్.
కొన్ని షోల కోసం దీపికా పదుకొనేతో కలిసి వెళ్లానని, ఆ తర్వాత ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని ఆమెతో ప్రేమాయణం గురించి కొట్టిపాడేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
అయితే అప్పటిదాకా లాంగ్ హెయిర్‌తో ట్రెండ్ సెట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, షార్ట్ హెయిర్‌ స్టైల్‌లో మారడానికి దీపికా పదుకొనేనే కారణమంటారు చాలామంది...
కిమ్ శర్మ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువీతో దీపికా కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రెస్టారెంట్లకి, కొన్ని షోలకు కలిసి వెళ్లిన ఫోటోలు వార్తల్లో నిలిచాయి...
అయితే వీరి అనుబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.. ప్రాణ స్నేహితులుగా ఉన్న యువీ, ధోనీ మధ్య రిలేషన్... దీపికా ఇష్యూ తర్వాత పూర్తిగా మారిపోయిందని అంటారు...
అయితే ధోనీ కెప్టెన్‌ అయిన తర్వాత సీనియర్ల విషయంలో వ్యవహారించిన తీరు... యువీ దూరం కావడానికి కారణమని మరికొందరి వాదన...

Latest Videos

click me!